ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో అతడే మహేష్.. రీరిలీజ్ తో అరాచకమే!

సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో అందరికి తెలుసు.

మరి ఈయనకు ఆ స్థాయిలో ఫాలోయింగ్ రావడానికి ఆయన కెరీర్ లో చేసిన కొన్ని సినిమాలే కారణం.

మరి అలాంటి సూపర్ హిట్ సినిమాల్లో పోకిరి ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమా మహేష్ ఆల్ టైం హిట్ లలో ఒకటిగా మిగిలి పోయింది.

మరి అలంటి సినిమాను మరోసారి రీ రిలీజ్ చేసేందుకు అంతా సిద్ధం అయ్యారు.నేటి అధునాతన డిజిటల్ సాంకేతికతను జోడించి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్ఫీ ఆడియోతో ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.ఆగష్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.50 నుండి 70 స్క్రీన్ లలో రిలీజ్ చేయాలనే అనుకున్నారు.ముందు ఈ సినిమా టికెట్స్ విషయంలో అనుమానాలు వచ్చిన ఫ్యాన్స్ ఈ సినిమాపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూస్తుంటే అందరి మైండ్ బ్లాంక్ అవుతుంది.

ఇక ఇప్పుడు ఏకంగా 150 స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.ఇక్కడే కాకుండా ఓవర్సీస్ లో సైతం హౌస్ ఫుల్ అవుతుండడంతో అప్పటికి స్క్రీన్ లు మరిన్ని పెరిగిన ఆశ్చర్యం లేదు.

Advertisement

ఇన్నేళ్ల తర్వాత ఇంత రెస్పాన్స్ చుసిన వారంతా పండుగాడు కొట్టే దెబ్బకు షాక్ అవుతున్నారు.ఈ సినిమా ఇప్పటికి ఎన్ని సార్లు అయినా చూడడానికి ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ముందు ఉంటారు.ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు.

అని మహేష్ చెప్పిన డైలాగ్ ను ఇప్పటికి ఫ్యాన్స్ వాడుతూనే ఉంటారు.ఈ సినిమా రిలీజ్ అయ్యి 16 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ఎవ్వరికి పోలేదు.

మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్చూస్తుంటే రీరిలీజ్ లో కూడా గట్టిగానే కొట్టేలా కనిపిస్తుంది.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు