మార్కెట్లోకి పాకెట్ ఏసీలు వచ్చేశాయి.. ధరలు అందుబాటులోనే!

కాలానికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా బడా సైజులనుండి బుల్లి సైజులో మారిపోతున్నాయి.మొన్నటికి మొన్నే మినీ సైజు ఏసీ( Mini size AC )లు గురించి మాట్లాడుకున్నాం.

 Pocket Acs Have Arrived In The Market Prices Are Affordable,,ac, Pocket Ac,sony-TeluguStop.com

అదింకా మరిచిపోక ముందే ఇపుడు మైక్రో సైజులో వుండే ఏసీలు గురించి మాట్లాడుకుంటున్నాం.ప్రస్తుతం ఎండాకాలం కనుక వీటి అవసరం ఎంతైనా వుంది.

పెద్ద సైజు ఏసీలు ఇంట్లోనే పెట్టుకోగలం.అదే పాకెట్ ఏసీలను( Pocket ACs ) అయితే ఇపుడు ఏకంగా మనతోపాటు తీసుకోని పోవచ్చు.

అవి బయటకి కూడా కనిపించవు.శరీరంలో ఎక్కడో ఒకచోట ఫిక్స్ చేస్తే ఒళ్ళంతా చల్లదనాన్ని ఇస్తుంది.

Telugu Cool Drinks, Size Ac, Pocket Ac, Sony Company, Sonyryan, Ups-Latest News

బయట తిరుగుతున్నప్పుడు ఎండ, వేడి నుంచి తప్పించుకోవడానికి సాధారణంగా కూల్ డ్రింక్స్( Cool drinks ) తాగి ఉపశమనం పొందుతుంటారు.అయితే, ఇకనుంచి అంత కష్ట పడాల్సిన పనిలేదు అంటోంది సోనీ కంపెనీ.అవును, ఎండల్లోనూ ఏసీ కింద ఉండొచ్చు.అందుకే అందరికీ అందుబాటులో ఉండాలని పాకెట్ ఏసీని తయారు చేసింది.సోనీ రియాన్ పాకెట్ ఏసీ2 పేరుతో తీసుకొస్తున్న ఈ ఏసీ.జేబులో పట్టేస్తుంది అంటే మీరు నమ్మితీరాలి.క్రౌడ్‌ఫండింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా తీసుకొస్తున్న ఈ ఏసీ.పవర్ బ్యాంక్ సైజులో ఉంటుంది.స్మార్ట్ ఫోన్ తో ఈ డివైజ్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

Telugu Cool Drinks, Size Ac, Pocket Ac, Sony Company, Sonyryan, Ups-Latest News

టెంపరేచర్ ఎలా కావాల్సి వస్తే అలా మార్చుకోవచ్చు.అయితే, ఈ ఏసీ కేవలం ఎండాకాలమే కాదు.చలి కాలంలో కూడా పనికొస్తుంది.

అదెలాగంటే.చలికాలంలో దీనిని టెంపరేచర్ కి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు.

కారు, వైన్ కూలర్స్‌లో ఉపయోగించే టెక్నాలజీతో ఈ పాకెట్ ఏసీని తయారుచేసింది సోనీ కంపెనీ.రియాన్ పాకెట్ ఎయిర్ కండీషనర్‌తో పాటు స్మాల్, మీడియం, లార్జ్ సైజ్‌ల టీషర్ట్స్ వస్తాయి.

అందులో ఏసీని ఉంచాలి.లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది.2 గంటలు ఛార్జ్ చేస్తే రోజంతా వీటిని ఉపయోగించుకోవచ్చు.కాగా దీని ధర సుమారు రూ.10,990.ఈ డివైజ్తో పాటు ఓ టీషర్ట్ కూడా వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube