గత కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీ( Telangana BJP ) నెమ్మదించింది.ముఖ్యంగా కర్నాటక ఎన్నికల తరువాత ఊహించని విధంగా ఆ పార్టీ ఘోర ఓటమిపాలు కావడంతో అప్పటి నుంచి తెలంగాణ బీజేపీలో కూడా అంతర్మథనం మొదలైంది.
ఎందుకంటే కర్నాటకలో బలంగా ఉన్నప్పటికి పార్టీకి ఓటమి తప్పలేదు.ఇక తెలంగాణలో పార్టీ బలం అంతంత మాత్రమే.
దాంతో ఎన్ని ప్రయత్నాలు చేసిన ఇక్కడ కూడా ఒంటమి తప్పదనే సందేహాలు కమలనాథులను వేదిస్తున్నట్లు తెలుస్తోంది.దానికి తోడు పార్టీ చాలమంది నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

దీంతో ఎన్నిక ముందు పార్టీ పరిస్థితి దిక్కు తోచని స్థితిలో ఉంది.ఇక మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు కమలనాథులు.ఈ నేపథ్యంలో జాతీయ నేతలు తెలంగాణ( Telangana )పై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే నేడు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు.ప్రభుత్వ కార్యకలాపాల దృష్ట్యా రాష్ట్రనికి ఆయన వస్తున్నప్పటికి.
అలాగే పార్టీలోని అంతర్గత విభేధాలను కూడా చక్కదిద్దడం పై కూడా ఆయన దృష్టి పెట్టె అవకాశం ఉంది.ఇక మద్యాహ్నం మహబూబ్ నగర్ లో నిర్వహించే ప్రజాగర్జన సభలో ప్రధాని పాల్గొంటారు.

ఇక ఈ సభలో మోడీ( PM Narendra Modi ) ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.యదాతధంగా కేసిఆర్ పాలనపై విమర్శలు గుప్పించి తిరిగి డిల్లీ వెళ్లిపోతారా లేదా పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపికపై గాని లేదా హామీల విషయంలో గాని ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తారా అనేది చూడాలి.అయితే మోడీ పర్యటన( Modi Tour ) అనంతరం రాష్ట్ర బీజేపీలో జోష్ పెరిగే అవకాశం లేకపోలేదు.ఎందుకంటే రాష్ట్రంలో మోడీ పర్యటించిన ప్రతిసారి పార్టీ బలోపేతంపై ఎంతో కొంత దృష్టి సరిస్తూనే ఉన్నారు.
అందుకే ప్రస్తుతం పార్టీలోని అంతర్గత స్థితిగతులపై నేతలందరికి కీలక సూచనలు ఇచ్చే అవకాశం ఉంది.మరి మోడీ టూర్ తరువాతైనా పార్టీలో కొత్త ఉత్సాహం పెరుగుతుందో లేదో చూడాలి.