మోదీ బస చేసిన హోటల్‌లో ఒక్క నైట్‌కి ఎంత చెల్లిస్తారో తెలిస్తే షాకే?

మనం ఎక్కడికన్నా ఇతర ప్రారంతాలకు ఏదైనా పని మీద వెళ్లినప్పుడు అక్కడ మనకి ఎవరూ తెలియనివారు లేకపోతే బయట హోటల్‌( Hotel )లో స్టే చేయాల్సిన పరిస్థితి వస్తుంది.ఈ క్రమంలో సాధారణంగా మనకి అక్కడ హోటల్ బిల్లు చూస్తే వాచిపోతుంది.

 Pm Modi Lavish Stay At Lotte New York Palace Costs 12 Lakh For A Night,pm Narend-TeluguStop.com

అవును మరి! ఒక హోటల్‌లో ఒక నైట్ బస చేయాలంటే వేలల్లో ఖర్చవుతుంది.అదే లగ్జరీ హోటల్స్‌( Luxury Hotels )లో ధరలు లక్షల్లోనే వుంటాయని మీకు ఐడియా వుందా? ఒక్కరోజు అక్కడ గడపడానికి చేసే ఖర్చుతో ఏకంగా ఒక మంచి కారు కొనుగోలు చేయొచ్చంటే మీరు నమ్ముతారా? నిజం.

Telugu Hotel, Gossip, Midtown, Latest-Latest News - Telugu

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ( Indian Prime Minister Narendra Modi ) బస చేసిన ఓ హోటల్ సింగిల్ నైట్‌కే ఏకంగా రూ.12.15 లక్షలు ఛార్జ్ చేసిందనే విషయం మీకు తెలుసా? ఇక ఆ హోటల్ పేరు లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ మిడ్‌టౌన్( Lotte New York Palace Midtown). ఈ ఫ్యాన్సీ హోటల్ మాన్‌హట్టన్‌లో ఉంటుంది.ఇది 1880ల కాలం నాటిది.రోమన్ చక్రవర్తిలా జీవించాలనుకున్న ధనవంతుడు హెన్రీ విల్లార్డ్ ఈ ప్రైవేట్ ఇల్లును నిర్మించుకున్నారట.ఇతను ఉత్తర పసిఫిక్ రైల్వే అధ్యక్షుడు, రైల్వే ఇండస్ట్రీలో పేరు, ప్రఖ్యాతలు గాంచాడు.అయితే ఆయన తరువాత 1980వ దశకంలో దీనిని లియోనా హెల్మ్‌స్లీ అనే మహిళ కొనుగోలు చేశారు.

తరువాత ఆమె దానిని చాలా అక్రమంగా నడిపారని చరిత్ర చెబుతోంది.

Telugu Hotel, Gossip, Midtown, Latest-Latest News - Telugu

బరాక్ ఒబామా( Barack Obama ), డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ వంటి చాలామంది దేశాధినేతలు బస చేసిన ఘనత ఆ హోటల్ కి వుంది.లోట్టే న్యూయార్క్ ప్యాలెస్‌ను CW టెలివిజన్ షో అయిన “గాసిప్ గర్ల్ ( Gossip Girl )”కు సెట్టింగ్‌గా ఉపయోగించారు.షోలోని పాపులర్ క్యారెక్టర్ అయిన సెరెనా వాన్ డెర్ వుడ్‌సెన్ హోటల్ టవర్స్ పెంట్‌హౌస్ సూట్‌లో స్టే చేశారు.

కాగా ఈ షో మిలీనియల్స్‌ 1981-1996 మధ్య బాగా ప్రాచుర్యం పొందింది.అందులో అనేక సన్నివేశాలలో హోటల్‌ ఆనందాన్ని మనం చూడవచ్చు.ఈ షో న్యూయార్క్ నగరంలోని సంపన్న యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది.వారి పార్టీలు, హుక్‌అప్‌లు, ఇతర డ్రామాలకు నేపథ్యంగా హోటల్‌ను ఉపయోగించారు.

ఫలితంగా, హోటల్ జనరేషన్ Y ( Millennials ) ప్రజల్లో బాగా పాపులర్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube