మరీ అంత ప్రేమ ఉంటే కష్టమే... ఇలాగే జరుగుతుంది మరి?

ప్రేమ మైకంలో( Love ) నేటి యువత కొట్టుమిట్టాడుతోంది.ఇక సోషల్ మీడియా వచ్చాక వారి విపరీత చర్యలు నషాళానికెక్కాయి.

 Couple Fell Down After Bike Stunt Misfire Video Viral Details, Viral News, Lates-TeluguStop.com

ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు.కొన్ని సార్లు వారిని కని, పెంచి, పెద్దవాళ్ళని చేసిన తల్లిదండ్రులని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు.

లవ్ లో ఉన్నామనగానే సినిమా హీరోల్లాగా ఫీల్ అయిపోతున్నారు.దానికితోడు సోషల్ మీడియా తోడు ఒకటి తయారయ్యింది కదా.ఇంకేముంది కట్ చేస్తే వారి పైత్యం చూపిస్తూ ఒక్కోసారి బక్కబోర్లా పడుతున్నారు.ఈ మధ్య కాలంలో బైక్ పై స్టంట్స్( Bike Stunts ) చేస్తున్నవారి సంఖ్య బాగా పెరిగిపోతోంది.

ఇక ప్రేమ మత్తులో వున్న యువతీ యువకులకు అయితే ఏం చేస్తున్నామో కూడా సోయిలేనంతగా బైక్ పై ప్రేమ ప్రయోగాలు చేస్తున్నారు.అవును, సోషల్ మీడియా వచ్చాక లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ ను ప్రేమికులు( Lovers ) చూస్తున్నారు.సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు కొని తెచ్చుకుటుంబున్నారు.తాజాగా ఓ ఇద్దరు ప్రేమికులు బైక్ సాహసం చేసేశారు.లవ్ సింబల్ చూపిస్తూ బైక్ ను లేపాలనుకున్నారు.అయితే కంట్రోల్ తప్పి పోయి బైక్ వెనుకకు జారి ఇద్దరు ప్రేమికులు కింద బక్కబోర్లా పడిపోయారు.

అదృష్టం ఏంటంటే బండి వీరి మీద పడకుండా కాస్త దూరం జరిగింది.లేకుంటే వీరిద్దరి ప్రాణాలు గాల్లో కలిసేవి.

దాంతో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్( VC Sajjanar ) తాజాగా ఆ వీడియోను షేర్ చేస్తూ… “యువతీయువకులారా! సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోకండి.లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ అసలే చేయకండి.ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి.సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను మనో వేదనకు గురిచేయకండి.” అంటూ కొటేషన్ రాసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube