ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మోడీ ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది.ఈ (ఉచిత రేషన్ పథకం) కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది రేషన్ కార్డ్ హోల్డర్లు ఇప్పుడు సెప్టెంబర్ 2022 వరకు ఉచిత రేషన్ పొందవచ్చు.
లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన తర్వాత మార్చి 2020లో పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ప్రభుత్వం ప్రకటించింది.కరోనా మహమ్మారితో తలెత్తిన ఆర్థిక సమస్యలకు ఉపశమనం కలిగించడం ఈ పథకం ఉద్దేశం.
ఈ పథకం తొలుత ఏప్రిల్-జూన్ 2020 కాలానికి ప్రారంభించారు.అయితే ఆ తర్వాత దానిని నవంబర్ 30 వరకు పొడిగించారు.
ఈ పథకం కింద ఎలా ప్రయోజనం పొందవచ్చనే ప్రశ్న ఇప్పుడు మీ మదిలోకి వచ్చేవుంటుంది.ఈ పథకం కింద ఉచిత రేషన్ ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద భారతదేశంలోని దాదాపు 80 కోట్ల మంది రేషన్ కార్డ్ హోల్డర్లు లబ్ధి పొందవచ్చు.
కార్టులోని ప్రతి సభ్యునికి నెలకు 5 కిలోల ధాన్యం (గోధుమ-బియ్యం) పొందుతారు.
రేషన్ కార్డుదారుడు తన కోటా రేషన్‌తో పాటు ఈ పథకం కింద ప్రతి నెలా 5 కిలోల అదనపు రేషన్ పొందవచ్చు.ఈ పథకం కిం .ఇప్పటివరకూ మీరు ఏ రేషన్ దుకాణంలో ఆహారధాన్యాలు తీసుకుంటున్నారో అక్కడే ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు.ఈ కేంద్ర ప్రభుత్వ ఈ పథకం రేషన్ కార్డు లేని వారికి వర్తించదు.
ఈ పథకం దేశంలో 80 కోట్లకు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు మాత్రమే వర్తిస్తుంది.అయితే మీకు రేషన్ కార్డ్ ఉండి, ఈ పథకం కింద రేషన్ డీలర్లు మీ కోటాకు ఆహారం ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు టోల్ ఫ్రీ నంబర్‌లో దీనిపై ఫిర్యాదు చేయవచ్చు.
జాతీయ ఆహార భద్రతా పోర్టల్ (ఎన్ఎఫ్ఎస్ఏ)లో ప్రతి రాష్ట్రం కోసం టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉన్నాయి.దీనికి కాల్ చేయడం ద్వారా మీరు మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.







