ఎన్టీఆర్ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న బుచ్చిబాబు రెండో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించగా బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా ఆ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ను జక్కన్న నీటితో ఎందుకు పోల్చారో సినిమా చూసిన తర్వాతే తనకు అర్థమైందని బుచ్చిబాబు అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ నటన మహా సముద్రమని బుచ్చిబాబు షాకింగ్ కామెంట్లు చేశారు.
రామ్ చరణ్ నటన సినిమాలో అగ్నిపర్వతంలా బద్ధలైందని బుచ్చిబాబు వెల్లడించారు.రాజమౌళి వల్లే ఈ ఇద్దరు హీరోలను కలపడం సాధ్యమైందని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక కాపరి ఉన్నాడని ఆయనే రాజమౌళి అని బుచ్చిబాబు వెల్లడించారు.బుచ్చిబాబు జక్కన్నను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.సుకుమార్ ఇప్పటికే రాజమౌళి దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్న సంగతి తెలిసిందే.జక్కన్న తన సినిమాలతో సినిమాసినిమాకు తన స్థాయిని పెంచుకుంటున్నారు.
బుచ్చిబాబు మూవీలో తారక్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నారు.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తొలి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ బుచ్చిబాబు మూవీ కావడం గమనార్హం.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది.ఎన్టీఆర్, చరణ్ తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ సాధించాల్సి ఉంది.
ఎన్టీఆర్, బుచ్చిబాబు కాంబో మూవీ షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.