అయ్యోయో: గొరిల్లా గ్లూ తో గేమ్స్.. చివరికి..?!

కొద్ది రోజుల క్రితం లూసియానా కి చెందిన టెస్సికా బ్రౌన్ అనే ఓ టిక్ టాక్ యూజర్ గొరిల్లా గ్లూ(జిగురు) ని జుట్టుకు అప్లై చేసుకొని ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.నెలరోజులపాటు తలకి అతుక్కుపోయిన జుట్టుతో ఆమె నరకయాతన పడింది.

 Playing Games With Glu Gum For Finallly, Gorilla, Glu, Lips, Operation, Viral, S-TeluguStop.com

అయితే 2 రోజుల క్రితం ఒక ప్లాస్టిక్ సర్జరీ నిపుణుడు రంగంలోకి దిగి ఆమెకు 4 గంటల పాటు సర్జరీ చేసి ఓ ద్రావణి సహాయంతో గోరిల్లా గ్లూ ను జట్టు నుంచి వేరు చేయగలిగాడు.ఈ సర్జరీ చేసినందుకుగాను పన్నెండు వేల ఐదు వందల డాలర్లు ఖర్చయిందని కానీ ప్లాస్టిక్ సర్జరీ నిపుణుడు ఆమెకు ఉచితంగానే వైద్యం చేశాడని సమాచారం.

అయితే టెస్సికా బ్రౌన్ గొరిల్లా గ్లూ గురించి అబద్ధం చెబుతోందని లూసియానా కి చెందిన లెన్ మార్టిన్ అనే ఒక వ్యక్తి ఆరోపించాడు.కావాలంటే తాను గొరిల్లా గ్లాస్ తో ఒక ప్లాస్టిక్ కప్ ని మూతికి అతికించుకుని వెంటనే తీసేస్తానని చాలెంజ్ చేశాడు.

అంతేకాదు ప్లాస్టిక్ కప్ చుట్టూ గొరిల్లా గ్లూ అప్లై చేసి దానిని తన మూతికి అతికించుకున్నాడు.నాలిక తడితో కప్ ని తొలగించుకోవచ్చు అని అతను అనుకున్నాడు కానీ అలా జరగలేదు.

ఎంత గట్టిగా లాగినా కూడా ఆ కప్ అతని చర్మాన్ని వదిలిపెట్టలేదు.దీంతో ఇక చేసేదేమీలేక ఆస్పత్రిలో చేరాడు.

అయితే వైద్యులు పరీక్షించి మార్టిన్ పెదాలపై కొంత భాగం వరకు చర్మాన్ని తొలగిస్తేనే ఈ కప్ వేరు చేయగలమని చెప్పారట.దీంతో మార్టిన్ తాను చేసిన ప్రయోగం విఫలం అయిందని.

టెస్సికా బ్రౌన్ చెప్పిందంతా కూడా నిజమేనని.గోరిల్లా గ్లూ తో పిచ్చి పనులు ఎవరు చేయకండి అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.

త్వరలోనే తన పెదాలకు సర్జరీ జరగబోతోందని.అందరూ తనకోసం ప్రార్ధించాలని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

ఏది ఏమైనా టెస్సికా బ్రౌన్, లెన్ మార్టిన్ చేసిన పిచ్చి పనులకు గాను నెటిజన్లు తీవ్రస్థాయిలో తిట్టిపోస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube