వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీళ్లే..!

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టోర్నీలో అనేక పాత రికార్డులు బద్దలు అవుతూ.

సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి.

గెలుపు, ఓటములను పక్కన పెడితే టోర్నీలో పాల్గొన్న జట్ల ఆటగాళ్లు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి తమ ఖాతాలలో వేసుకుంటున్నారు.తాజాగా నెదర్లాండ్స్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సరికొత్త సెంచరీ రికార్డ్ క్రియేట్ అయింది.

ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్ గ్లెన్ మాక్స్ వెల్( Glenn Maxwell ) మిడిల్ ఆర్డర్ లో వచ్చి విధ్వంసక బ్యాటింగ్ ఆడాడు.

కేవలం 40 బంతుల్లో సెంచరీ చేశాడు.మొత్తం 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు.వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 49 బంతుల్లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఎయిడెన్ మార్కరమ్( Aiden Markram ) సెంచరీ చేసి, అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Advertisement

కానీ తాజాగా గ్లెన్ మాక్స్ వెల్ ఆ రికార్డు బద్దలు కొట్టి తన పేరిట లిఖించుకున్నాడు.వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ( Fastest Century ) చేసిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

తాజాగా జరిగిన నెదర్లాండ్స్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ 40 బంతుల్లో సెంచరీ చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

2023లో శ్రీలంక తో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఎయిడెన్ మార్కరమ్ 49 బంతుల్లో సెంచరీ చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.2011లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో కెవిన్ ఓబ్రెయిన్( Kevin OBrien ) 50 బంతుల్లో సెంచరీ చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.2015లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గ్లెన్ మాక్స్ వెల్ 51 బంతుల్లో సెంచరీ చేసి ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.2015 లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో ఏబీ డివిలియర్స్( AB De Villiers ) 52 బంతుల్లో సెంచరీ చేసి ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు