తులసి లో ఎన్నో ఔషధ గుణాలు( Medicinal properties ) ఉంటాయని అందరికీ తెలిసిందే.కాబట్టి తులసికి మార్కెట్లో ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది.
సాధారణంగా మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంటుందో అదే సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తారు.తులసి ను సుగంధాలు, తైలాలు తయారీకి ఉపయోగిస్తారు.
కాబట్టి తులసి ( basil )సాగుపై అవగాహన కల్పించుకుంటే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.తులసి సాగులో సస్యరక్షక పద్ధతులు ఏంటో చూద్దాం.
తులసి సాగుకు నీరు నిలిచే భూములు తప్ప అన్ని భూములు సాగుకు అనుకూలంగా ఉంటాయి.భూమి యొక్క పీహెచ్ విలువ 5 నుంచి 8.5 వరకు ఉండే నేలలలో అధిక దిగుబడి పొందవచ్చు.ఇక ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు ఉండే వాతావరణంలో తులసి మొక్కలు బాగా పెరుగుతాయి.

ఒక ఎకరం పొలానికి దాదాపుగా 200 గ్రాముల విత్తనాలు అవసరం.ఈ విత్తనాలలో ఇసుకను కలిపి ఏప్రిల్, మే నెలలలో నారుమడులలో చల్లుకుంటే, వారం తర్వాత విత్తనం మొలకెత్తుతుంది.ఒక నెలకు నారు పొలంలో నాటుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.వేసవికాలంలో భూమిలో లోతు దుక్కులు దున్ని ఆఖరి దుక్కిలో పశువుల ఎరువేసి కలియదునాలి.తర్వాత మొక్కలు నాటే ముందు ఇంకోసారి దున్నుకొని రసాయన ఎరువులు వేసి నాగలి సహాయంతో సాళ్లు తయారు చేసుకోవాలి.ఒక ఎకరం పొలంలో చిలికిన పశువుల ఎరువు ఎనిమిది టన్నులు వేసుకోవాలి.
వీటితోపాటు నత్రజని, ఫాస్పరస్, పోటాష్ ( Nitrogen, Phosphorus, Potash )సంబంధింత ఎరువులు వేసుకోవాలి.

ప్రధాన పొలంలో తులసి మొక్కలు నాటుకున్న తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి వారంలో రెండుసార్లు నీటి తడులు అందించాలి.భూమిలో తేమశాతం అధికంగా ఉంటే వారానికి ఒకసారి మాత్రమే నీటి తడులు అందించాలి.మొక్కలు నాటిన నెల వ్యవధిలో కచ్చితంగా కలుపు నివారించాలి.
తర్వాత రెండు నెలల వ్యవధిలో కనీసం మూడుసార్లు కలుపు నివారించాలి.కలుపు మొక్కలు( Weeds ) నివారించిన అనంతరం ఎరువులు అందించాలి.ఒక హెక్టారులో తులసి పండించడానికి రూ.15,000 మాత్రమే ఖర్చు అవుతుంది.తర్వాత ఈ పంట వల్ల దాదాపుగా రూ.3 లక్షల రూపాయల రాబడి పొందవచ్చు.కాబట్టి రైతులు ముందుగా అవగాహన ఉండే పంటలనే సాగు చేయాలి.అప్పుడే అధిక దిగుబడి పొందవచ్చు.అలా కాకుండా తెలియని పంట సాగు చేయాలంటే ముందుగా అవగాహన కల్పించుకోవడం తప్పనిసరి.
