ఓరినీ.. విమానంను ఆటో పైలెట్‌ మోడ్‌లో పెట్టి నిద్ర పోయిన పైలెట్‌, చివరకు ఏమైందంటే

విమాన ప్రయాణం అంటేనే జనాలు కొందరు వణికి పోతారు.

ఎందుకంటే ప్రతి రోజు ప్రపంచంలో ఏదో ఒక మూలన విమాన ప్రయాణంకు సంబంధించిన వార్తలు మీడియాలో చూస్తూ వస్తున్నాం.

విమాన ప్రమాదాలు ఎక్కువగా సాంకేతిక లోపం వల్ల కలుగుతున్న విషయం తెల్సిందే.అయితే కొన్ని మాత్రం పైలెట్‌ అజాగ్రత్తల వల్ల జరుగుతున్నాయి.

ఎన్నో విమాన ప్రమాదాలు జరిగినా కూడా పైలెట్లు మరియు విమానయాన శాఖలు జాగ్రత్తలు పెంచడంలో మాత్రం విఫలం అవుతున్నారు.తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక ట్రైనీ పైలెట్‌ చేసిన పనికి అంతా కూడా అవాక్కవుతున్నారు.

అసలు అలా ఎలా చేస్తాడంటూ మళ్లీ అతడు ఎప్పుడు విమానం కూడా ఎక్కేందుకు అవకాశం ఇచ్చేందుకు అధికారులు నో చెబుతున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Advertisement

ఆస్ట్రేలియాకు చెందిన డైమండ్‌ డీఏ 40 అనే విమానంలో ట్రైనీ పైలెట్లు శిక్షణ పొందుతారు.కాస్త ఎక్కువ ట్రైన్డ్‌ అయిన వారు మాత్రం సొంతంగానే ఒంటరిగానే విమానంను వేసుకుని వెళ్తారు.తాజాగా ఒక ట్రైనీ పైలెట్‌ విమానంను తీసుకు వెళ్లాడు.5500 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత ఆ విమానంకు ఎయిర్‌ పోర్ట్‌తో సంబంధాలు తెగి పోయాయి.దాదాపు 45 నిమిషాల పాటు అసలు ఆ విమానం ఎక్కడ పోయింది, ఎటు పోయింది అనే విషయాలు తెలియకుండా పోయింది.

అయితే హఠాత్తుగా ఆ విమానం ఎయిర్‌ పోర్ట్‌ వద్దకు వచ్చి సిగ్నల్‌ ఇచ్చింది.అప్పుడు ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు షాక్‌ అయ్యారు.ల్యాండింగ్‌కు క్లియరెన్స్‌ ఇచ్చేందుకు విమానాశ్రయ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా కూడా పైలెట్‌ స్పందించడం లేదు.

దాంతో అసలు పైలెట్‌ బతికి ఉన్నాడా లేడా అనే అనుమానం వచ్చింది.అంతలోనే విమానంను పైలెట్‌ సురక్షితంగా తించాడు.

ఈ విమానంలో ప్రయాణించిన ట్రైనీ పైలెట్‌కు ముందు రోజు నిద్ర లేక పోవడంతో పాటు, ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ కూడా చేయకుండా విమానం ఎక్కాడట.నిద్రలేమి కారణంగా ఆ పైలెట్‌ తీవ్ర ఒత్తిడికి గురయ్యి నిద్ర పోవాలని నిర్ణయించుకున్నాడు.అందుకోసం విమానంను ఆటో పైలెట్‌ మోడ్‌ అంటే పైలెట్‌ లేకుండానే విమానం రన్‌ అవుతూ ఉంటుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఆటో పైలెట్‌ మోడ్‌లో పెట్టి నిద్రలోకి జారుకున్నాడు.

Advertisement

నిద్రలోకి జారుకున్న పైలెట్‌ విమానం ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్న తర్వాత కూడా లేవలేదు.అయితే ఆ విమానం పక్కన ఒక పెద్ద విమానం వెళ్తుండటంతో పెద్ద సౌండ్‌ అయ్యి నిద్రనుండి లేచి వెంటనే విమానంను ల్యాండ్‌ చేశాడు.ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎయిర్‌ ఆస్ట్రేలియా అతడిపై చర్యలకు సిద్దం అయ్యింది.

ఎప్పటికి పైలెట్‌ అవ్వకుండా ఆదేశాలు జారీ చేసింది.నిద్రలేకుండా విమానం నడిపిందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిపై కేసు కూడా నమోదు అయినట్లుగా తెలుస్తోంది .

తాజా వార్తలు