గుజరాత్‎లో కేబుల్ బ్రిడ్జి ఘటనపై సుప్రీంకోర్టులో పిల్

గుజరాత్‎లో చోటు చేసుకున్న కేబుల్ బ్రిడ్జి ఘటనపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

బ్రిడ్జి కూలిన ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో జ్యుడీషియల్ కమిషన్ నియమించేలా ఆదేశించాలని పిల్ దాఖలైంది.

పాత వంతెనలు, స్మారక కట్టడాల భద్రతను నిర్ధారించేందుకు సర్వే, రిస్క్ అసెస్మెంట్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.ఇప్పటికే ఈ దుర్ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మరోవైపు ఈ ప్రాంతాన్ని ప్రధాని మోదీ పరిశీలించనున్నారు.అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.

మోర్బీలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటీష్ కాలం నాటి తీగల వంతెన కుప్పకూలి 141 మంది ప్రాణఆలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Advertisement
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?

తాజా వార్తలు