తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలు అవుతున్న దళితబంధు పథకంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.దళితబంధు పథకం అమలులో ఎమ్మెల్యేల సిఫార్సులు ఉండకూడదని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు.
త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో దళితబంధు పథకానికి అర్హులుగా వారికి కావాల్సిన వారినే ఎంపిక చేస్తున్నారని పేర్కొన్నారు.అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరులకే పథకాన్ని వర్తింపజేస్తున్నారని, మిగతా వారిని పట్టించుకోవడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికైనా లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించే విధంగా చర్యలు తీసుకోనేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారని తెలుస్తోంది.ఈ పిటిషన్ పై వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.