ప్రముఖ యూపీఐ ఫ్లాట్‌ఫామ్ ఫోన్ పే( Phonepe ) గురించి అందరికీ తెలిసిందే.వేరే వ్యక్తి నగదు పంపించాలన్నా లేదా నగదు రిసీవ్ చేసుకోవాలన్నా ఎంతో వేగంగా పని అవుతుంది.
ఎక్కువమంది వినియోగిస్తున్న యూపీఐ ఫ్లాట్‌ఫామ్ గా ఫోన్ పే నిలిచింది.అలాగే షాపుల యజమానులు కూడా డిజిటల్ పేమెంట్స్( Digital Payments ) స్వీకరించేందుకు గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే లాంటి యూపీఐ పేమెంట్స్ స్కానర్లు ఏర్పాటు చేస్తున్నారు.
దీని వల్ల వినియోగదారులకు పని సులువు అవుతుంది.అలాగే నగదు అంతుకున్నామా.
లేదా అనేది తెలసుకునేందుకు ఆడియో స్పీకర్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఫోన్ పే ఆడియో స్పీకర్లు( Phonepe Audio Speakers ) రికార్డ్ సృష్టించాయి.నాలుగు మిలియన్లకుపైగా స్మార్ట్ స్పీకర్లకు విస్తరించి కీల మైలురాయికి ఫోన్ పే చేరుకుంది.దేశంలోని 19 వేల పోస్టల్ కోడ్ లతో ఫోన్ పే ఫ్లాట్‌ఫారంను 36 మిలియన్ల వ్యాపారులు ఉపయోగిస్తున్నారు.
ఒక సంవత్సరం క్రితం ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లను( Smart Speakers ) ప్రవేశపెట్టింది.దేశీయ వాయిస్ నోటిఫికేషన్లను దీని ద్వారా పొందుతున్నారు.ఈ స్మార్ట్ స్పీకర్లు పోర్టబిలిటీ, పొడిగించిన బ్యాటరీ జీవితం, ధ్వనించే వాతావరణంలో కూడా ఆడియో స్పష్టంగా వినిపిస్తుంది.స్మార్ట్‌స్పీకర్లు రాకముందు వ్యాపారులు ఎస్‌ఎంఎస్‌పై ఆధారపడేవారు.

ఇప్పుడు స్మార్ట్‌స్పీకర్లు వచ్చిన తర్వాత వ్యాపారులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.ఈ స్మార్ట్‌స్పీకర్లు నాలుగు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.అలాగే డెడికేటెడ్ డేటా కనెక్టివిటీ, ఎల్‌ఈడీ బ్యాటరీ స్థాయి సూచికలు, తక్కువ బ్యాటరీ స్థాయిల కోసం ఆడియో అలర్ట్ లు( Audio Alerts ) లాంటి ఫీచర్లు ఉన్నాయి.అలాగే చివరి లావాదేవీకి డెడికేట్ చేసిన రీప్లే బటన్ తో పాటు ప్రాంతీయ బాషల్లో కూడా వాయిస్ చెల్లింపు నోటిఫికేషన్లు పొందవచ్చు.
దీంతో వ్యాపారుల వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు.







