ఫోన్ ట్యాపింగ్( Phone Tapping ) అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Central Minister Kishan Reddy ) స్పందించారు.బీఆర్ఎస్( BRS ) ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ ( BJP ) కార్యాలయ సిబ్బంది ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.బ్లాక్ మెయిల్ కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.
తమ నేతల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారన్న కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు.ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కు అప్పటి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గతంలో మాఫియా రాజ్యంగా బీఆర్ఎస్ పాలన సాగిందన్నారు.ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.