ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు( Former DCP Radhakishan Rao ) రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు( Prabhakar Rao ) ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధా కిషన్ రావు చెప్పారని తెలుస్తోంది.ఓ సిమెంట్ సంస్థ యజమాని నుంచి రూ.70 లక్షలు సీజ్ చేశామని రాధా కిషన్ అంగీకరించారని సమాచారం.
దుబ్బాక ఉప ఎన్నికల వేళ రఘునందన్ రావుతో పాటు బంధువుల ఇళ్ల నుంచి రూ.
కోటి సీజ్ చేశామని రాధాకిషన్ ఒప్పుకున్నారు.మునుగోడు ఉపఎన్నిక సమయంలోనూ రూ.3.50 కోట్లు సీజ్ చేశామని పేర్కొన్నట్లు సమాచారం.కాగా ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావు ఏ4 గా ఉన్న సంగతి తెలిసిందే.