Phone pe: డెబిట్ కార్డు అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్.. ఫోన్ పే‌లో కొత్త సేవల వివరాలివే

డిజిటల్, నగదు రహిత చెల్లింపులను ఉపయోగించడానికి ఎక్కువ మంది ప్రజలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) అందించిన అప్‌డేట్‌తో ఫోన్ పే కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే యూపీఐ చెల్లింపులను ఎనేబుల్ చేసే వ్యవస్థతో ముందుకు వచ్చింది.ఆధార్ కార్డ్ ఆధారిత యూపీఐ పిన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఈ సేవతో నమోదు చేసుకున్న యూజర్లు తమ ఆధార్ నంబర్‌ను సంబంధిత బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం ద్వారా UPI చెల్లింపులను ప్రారంభించవచ్చు.ఈ సేవ ఇప్పటికే ఫోన్ పేలో అందుబాటులో ఉంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.యూపీఐ ద్వారా అందే సదుపాయాలు యూజర్లకు మరింత సౌకర్యవంతంగా చేయడానికి, డెబిట్ కార్డ్ లేని యూపీఐ ఐడీ పొందిన వారికి, వ్యాపారులకు ఫోన్ పే కొత్త సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

యూజర్లు UPI IDని డెబిట్ కార్డ్‌కు బదులుగా ఆధార్ కార్డ్‌తో లింక్ చేయవచ్చు.యూపీఐ ఐడీ హోల్డర్లు తమ ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా రెండింటితో ఒకే మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకున్నారని నిర్ధారించుకోవాలి.

ఈ సేవతో, డెబిట్ కార్డ్ లేని వ్యక్తులను UPI ద్వారా నగదు రహిత లావాదేవీలను నిర్వహించేలా ప్రోత్సహించడం కోసం ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.ఇందుకోసం మీరు మీ ఫోన్ పే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.

యాప్‌ని ఓపెన్ చేసి, మీరు మీ రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాను ఎంచుకోవలసి ఉంటుంది.ఇప్పుడు యాప్ అవసరాలకు అనుగుణంగా UPI IDని క్రియేట్ అవుతుంది.

తర్వాత ఆధార్ ఆధారిత ధృవీకరణను ఎంచుకుని, అన్ని నిబంధనలు మరియు షరతులను అంగీకరించాలి.తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్‌లో మొదటి 6 అంకెలను నమోదు చేయాలి.మీ ఆధార్ నంబర్‌ను ధృవీకరించిన తర్వాత కన్‌ఫర్మ్ నొక్కండి.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

తర్వాత మీరు ఆధార్ ఆధారిత UPI IDని సెటప్ చేస్తున్న యాప్‌ని బట్టి 4-అంకెల లేదా 6-అంకెల UPI పిన్‌ని సెట్ చేయవచ్చు.ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని అందులో ఎంటర్ చేయాలి.

Advertisement

ఇది అయిన తర్వాత తుది నిర్ధారణ కోసం మీరు ముందుగా సెట్ చేసిన UPI పిన్‌ని నమోదు చేయండి.పూర్తయిన తర్వాత మీరు ఇప్పుడు కొత్తగా సృష్టించిన UPI IDని ఉపయోగించి ఏదైనా మొబైల్ నంబర్‌కి చెల్లింపులు చేయవచ్చు.

నగదు లావాదేవీలు చేసుకోవచ్చు.

తాజా వార్తలు