ప్రముఖ యూపీఐ యాప్ ఫోన్ పే గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు.యూపీఐ పేమెంట్స్‌లో గూగుల్ పేకు పోటీగా ఫోన్ పేకు యూజర్లు ఉన్నారు.
గూగుల్ పేకు గట్టిగా పోటీగా నిలుస్తూ ఫోన్ పే యూజర్లను సంపాదించుకుంటోంది.ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.
కారు, బైక్ ఇన్యూరెన్స్ లాంటి సదుపాయాలను ఫోన్ పే కలిపిస్తుండగా.ఆ సర్వీసులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
2020 అక్టోబర్‌లో టూ-వీలర్ ఇన్యూరెన్స్ సదుపాయాన్ని ఫోన్ పే కల్పిస్తుండగా.ఇప్పటివరకు 10 లక్షల మంది తీసుకున్నారు.
ఇన్‌స్టంట్ ఇన్యూరెన్స్ ను అందిస్తుండగా.ఎటువంటి ఎంక్వైరీ లేకుండా గుడువు ముగిసిన పాలసీలను కూడా ఉచితంగా రెన్యూవల్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది.టైర్ 11, టైర్ 111 నగరాల నుంచే ఎక్కుమంది సబ్‌స్కైబ్ చేసుకున్నారు.75 శాతం కంటే ఎక్కువ కొనుగోళ్లు ఆ నగరాల నుంచే వచ్చాయని ఫోన్ పే ప్రతినిధులు తెలిపారు.
ఫేన్ పే ద్వారా ఇన్యూరెన్స్ పాలసీలను తీసుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, 2047 నాటికి అందూ బైక్ ఇన్యూరెన్స్ తీసుకునేలా ప్రోత్సహిస్తామన్నారు.80 శాతానికిపైగా వినియోగదారులు గడువు ముగిసిన కవర్ లతో కొనుగోలు చేశారని ఫోన్ పే స్పష్టం చేసింది.20 నిమిషాల్లోనే ఇన్ స్టంట క్లెయిమ్ పొందేలా సెటిల్ మెంట్ చేశామని స్పష్టం చేశారు.385 మిలియన్లకుపైగా వినియోగదారులు ఫోన్ పే ఉన్నారని తెలిపింది.

కాగా ఫోన్ పే యూపీఐ చెల్లింపులతో పాటు డిజిటల్ వాలెట్లు, ఇన్యూరెన్స్ పాలసీల ప్రీమియం చెల్లింపు, మ్యూట్యువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే సదుపాయం, ట్యాక్స్ సేవింత్ ఫండ్స్, లక్విడ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్యూరెన్స్ తో పాటు అనేక హెల్త్ ప్లాన్ లను అందిస్తోంది.







