గత కొద్ది రోజులుగా అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న పెట్రోల్ రేట్లను చూస్తుంటే సామాన్యుడి గుండె గుబేల్ అంటుంది.ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరకులతో అతి కష్టం మీద కాలాన్ని వెళ్లదీస్తున్న కష్టజీవికి ఈ పెట్రోల్ రేట్లు పిడుగులాంటి వార్తగా మారి అతలాకుతలం చేస్తున్నాయి.
ఇక రేట్లు ఇలా పెరుగుతున్న క్రమంలో ఏ ఒక్క నాయకుడు కూడా వీటిమీద నోరెత్తడం లేదేంటని ఆలోచిస్తున్నాడట సగటు జీవి.
ఇకపోతే వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న చమురు రేట్లు సెంచరీకి చేరువలో ఉన్న విషయం తెలిసిందే.
కానీ రాజస్థాన్‌లో మాత్రం ఆల్ రెడీ విజయవంతంగా సెంచరీ కొట్టింది.రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.101.15 కు పెరిగింది.ఇక నిన్న బుధవారం కూడా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసల చొప్పున పెరిగాయి.దీంతో రాజస్థాన్‌లో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర రూ.101.15 కు, సాధారణ పెట్రోల్ ధర రూ.98.40 కు పెరిగింది.
తాజా ధరల పెంపుతో ఢిల్లీలో సాధారణ పెట్రోల్ రేటు రూ.86.30 కు, లీటర్ డీజిల్ ధర రూ.76.23 కు పెరిగింది.ఈ పరుగులు ఇలాగే కొనసాగితే మాత్రం పేదవాడు ఆకలితో చావడం ఖాయమంటున్నారట విశ్లేషకులు.
ఎందుకంటే ఈ పెట్రోల్ సాకు చెప్పుకుని వ్యాపారులు అన్నీంటి ధరలు పెంచడం తెలిసిందే.