ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా పై హైకోర్టులో అఫిడవిట్ రూపంలో పిటిషన్ దాఖలు చేసినట్లుగా గజిటెడ్ ఆఫీసర్స్ జెఏసి అధ్యక్షుడు కృష్ణయ్య తెలియజేశారు.2018 జూలై నాటికి అమలు కావాల్సిన పిఆర్సీ ని 2020 జనవరికి ఇచ్చారనీ,పిఆర్సీ జీవోలలో లోపాలు వున్నాయని కోర్టుకు వెళ్లామన్ని ,కోర్టు ఆదేశాల ప్రకారం మా ఖాతాల నుండి ఎలాటి రికవరీలు చేయరాదని మద్యంతర ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు.కానీ ప్రభుత్వం మా జిపిఎఫ్ ఖాతా నుండి నగదు వెనక్కి తీసుకుందాన్ని,92 వేలు నా జిపిఎఫ్ అకౌంట్ నుండి డ్రా అయ్యిందనీ వెల్లడించారు.ఈ నేపథ్యంలో పిఆర్సీ జివోలపై వేసిన పిటీషన్ కు అనుబంధంగా అదనపు అఫిడవిట్ ద్వారా కోర్టుకు తెలిపినట్లుగా వివరించారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ఇంటీరియం ఆర్డరు ఇచ్చిందన్ని ,రెండు వారాల లోపు అఫిడవిట్ దాఖలు చెయ్యాలని హై కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినట్లుగా వివరించారు.