ఈ ప్రపంచంలో ఏ జంతువు తన యజమానిని ప్రేమించలేనంత నిస్వార్ధంగా కుక్కలు తమ ఓనర్లను ప్రేమిస్తాయి.ఓనర్లను కాపాడేందుకు ప్రాణాలను కూడా వదిలేందుకు అవి సిద్ధమవుతాయి.
యజమానుల ముఖంలో కనిపించే భావాలను కూడా ఇవి అర్థం చేసుకోగలవు.బాధలో ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి ఓదార్చగలవు.
అంత గొప్ప లక్షణాలు ఉన్న కుక్కల్లో కొన్ని చిలిపి లక్షణాలు కూడా ఉంటాయి.అవి కూడా మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తాయి.
ఇంట్లోని వస్తువులను నమలటం, గుంతలు తవ్వడం, ఏ కారణం లేకుండానే అటూ ఇటూ మస్తు ఫాస్ట్‌గా ఉరకడం వంటి చేస్తుంటాయి.ఒక్కోసారి ఇవి చాలా బుద్ధిగా నటిస్తూ మరోసారి యమ యాక్టివ్ అవుతూ అల్లరి అల్లరి చేస్తాయి.
అయితే తాజాగా ఒక కుక్క మాత్రం వీటన్నిటికీ మించి ఒక అల్లరి పని చేస్తోంది.దీనికి సంబంధించిన వీడియోని యానిమల్స్ డూయింగ్ థింగ్స్ అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.
వైరల్ అవుతున్న వీడియోలో మీరు సోఫాలో బుద్ధిగా కూర్చుని ఉన్న ఒక గోల్డెన్ రిట్రీవర్ ని చూడొచ్చు.అయితే కేవలం యజమానులు మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు ఈ కుక్క చాలా బుద్ధిగా ఉంటుందట.
కానీ ఎవరైనా బంధుమిత్రులు తమ ఇంటికి వస్తే చాలు ఇది ఎగిరి గంతులేస్తూ నానా బీభత్సం సృష్టిస్తుందట.
ఇది రెండు సందర్భాల్లో ఎలా ఉంటుందో వీడియోతో సహా చూపించాడు యజమాని.ఈ శునకం సోఫాలపై ఎలా ఎగురుతుందో మీరు కూడా చూడొచ్చు.
ఈ వీడియోకి మిలియన్ల వ్యూస్ రాగా, దాదాపు 70 వేల లైకులు వచ్చాయి.
ఈ వీడియోని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.తమ కుక్క కూడా ఎవరూ లేనప్పుడు చాలా బుద్ధిగా ఉంటుందని.
కరెక్ట్ గా ఎవరైనా చుట్టాల ఇంటికి వచ్చినప్పుడే అది అల్లరి అల్లరి చేస్తూ తెగ ఇబ్బంది పెడతుందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ క్యూట్ వీడియోని మీరు కూడా చూసేయండి.