యజమానిపై విశ్వాసం.. పాముతో పోరాడిన పిల్లి.. !

పెంపుడు జంతువులు తమను ప్రేమగా చూసే మనుషులపై తమ విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటాయి.మాములుగా అయితే కుక్కలు విశ్వాసంగా ఉంటాయని అందరు అంటూ ఉంటారు.

 Pet Cat Prevents Cobra From Entering House, Stands Guard For 30 Mins, Pet Cat Pr-TeluguStop.com

అనడమే కాదు నిజంగా కుక్కలు విశ్వాసంగానే ఉంటాయి.తమను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్న యజమానులకు చిన్న కష్టం వచ్చిన కూడా అవి చూస్తూ ఊరుకోవు.

తమను ప్రేమగా ఆదరించిన వ్యక్తులను అవి ఎప్పటికి మరచి పోవు. కృతజ్ఞత చూపిస్తూనే ఉంటాయి.అయితే కేవలం కుక్కలను మాత్రమే మనం విశ్వాసానికి మారుపేరు అంటాము.కానీ మిగతా జంతువులు కూడా తమ యజమానులపై కృతజ్ఞతను కలిగి ఉంటాయి.

అవసరమైతే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా యజమానులు కాపాడడానికి ముందు ఉంటాయి.

Telugu Catstands, Odisha, Pet Cat Cobra, Pet Cat Protect, Petcat-Latest News - T

తాజాగా ఒరిస్సాలో ఇలాంటి ఘటనే జరిగింది.తన యజమాని కుటుంబం ఆపదలో ఉందని వారు పెంచుకుంటున్న పెంపుడు పిల్లి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నాగు పాముతో తలపడింది.భువనేశ్వర్ లో నివసిస్తున్న సంపద్ ఇంట్లోకి సాయత్రం వేళలో ఒక నాగు పాము లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది.

ఆ నాగు పామును చుసిన సంపద్ కుటుంబ సభ్యులు భయపడ్డారు.

Telugu Catstands, Odisha, Pet Cat Cobra, Pet Cat Protect, Petcat-Latest News - T

అప్పుడు వారు పెంచుకుంటున్న పెంపుడు పిల్లి ఆ పాము ను చూసింది.ఆ నాగు పామును ఇంట్లోకి రానివ్వకుండా అడ్డు పడింది.ఆ పిల్లి ఆ పామును లోపలి రాకుండా దానితో పోరాడుతుంది.

వాళ్ళు ఈ లోపు స్నేక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు.ఆ పిల్లి స్నేక్ హెల్ప్ లైన్ వారు వచ్చే వరకు అక్కడే కాపలాగా ఉంది.

పామును ఇంట్లోకి రానివ్వ లేదు.తర్వాత వారు ఆ నాగు పామును పట్టుకుని వెళ్లిపోయారట.

చూసారా మూగ జీవులు కూడా ప్రేమను వ్యక్త పరుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube