పెసర పంటకు తీవ్ర నష్టం కలిగించే బూడిద తెగుల నివారణ కోసం సరైన యాజమాన్య పద్ధతులు..!

పెసర పంటను( Green Gram ) ఆశించి తీవ్ర నష్టం కలిగించే బూడిద తెగులు శిలీంద్ర బీజాంశాల ద్వారా పంటను ఆశిస్తాయి.ఈ శిలీంద్ర బీజాంశాలు మొక్కల అవశేషాలలో జీవించి ఉంటాయి.

 Pests Prevention In Green Gram Cultivation Details, Pests Prevention ,green Gram-TeluguStop.com

గాలి, నీరు, ఇతర బీజాల ద్వారా పెసర పంట మొక్కలను ఆశిస్తాయి. పొడి వాతావరణంలో కూడా ఈ శిలీంద్రం జీవించగలుగుతుంది.

ఉదయం సమయాలలో ఉండే పొగ మంచు, కొద్దిపాటి వర్షపాతం ఈ తెగుల వ్యాప్తికి( Pests ) అనుకూలంగా ఉంటాయి.

పెసర మొక్క ఆకులు, కాండం, కాయలపై పౌడర్ లాంటి తెల్లని మచ్చలు( White Spots ) ఏర్పడితే ఆ మొక్కకు బూడిద తెగుళ్లు ఆశించినట్టే.

ఈ తెగుళ్లు ఆకుల ఉపరితలంపై, ఆకుల కింది భాగంపై కూడా కనిపిస్తాయి.ఈ తెగులు పంటను ఆశించడం వల్ల మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ( Photosynthesis ) ఆగి, ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి.

కొన్ని ఆకులు వంకర్లు తిరిగి, విచ్ఛిన్నం చెంది రూపం కోల్పోతాయి.

ఈ తెగుళ్లు పెసర పంటను ఆశించకుండా ఉండాలంటే తెగులు నిరోధక మేలు రకం విత్తనాలను( Seeds ) ఎంపిక చేసుకుని సాగుచేపెట్టాలి.మొక్కల మధ్య మొక్కలం వరుసల మధ్య మంచి ప్రసరణ ఉండేలా కాస్త ఎక్కువ దూరంలో నాటాలి.మొదటిసారి ఈ మచ్చలు కనిపించిన వెంటనే వ్యాధి సోకిన ఆకులను( Infected Leaves ) తీసేయాలి.

పంట మార్పిడి చేస్తూ ఉండటం వల్ల తెగుల ప్రభావం పంటపై తక్కువగా ఉంటుంది.

పంట కోతల అనంతరం పొలంలో అవశేషాలన్నీ పూర్తిగా తొలగించాలి.వేసవి కాలం రాగానే లోతు దుక్కులు దున్నుకోవాలి.సేంద్రియ పద్ధతిలో ఈ తెగులను అరికట్టాలంటే గంధకం, వేప నూనె, ఆస్కార్బిక్ యాసిడ్ లాంటి వాటిని పిచికారి చేయాలి.

రసాయన పద్ధతిలో ఈ తెగులను అరికట్టాలంటే.నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube