పెసర పంటకు తీవ్ర నష్టం కలిగించే బూడిద తెగుల నివారణ కోసం సరైన యాజమాన్య పద్ధతులు..!
TeluguStop.com
పెసర పంటను( Green Gram ) ఆశించి తీవ్ర నష్టం కలిగించే బూడిద తెగులు శిలీంద్ర బీజాంశాల ద్వారా పంటను ఆశిస్తాయి.
ఈ శిలీంద్ర బీజాంశాలు మొక్కల అవశేషాలలో జీవించి ఉంటాయి.గాలి, నీరు, ఇతర బీజాల ద్వారా పెసర పంట మొక్కలను ఆశిస్తాయి.
పొడి వాతావరణంలో కూడా ఈ శిలీంద్రం జీవించగలుగుతుంది.ఉదయం సమయాలలో ఉండే పొగ మంచు, కొద్దిపాటి వర్షపాతం ఈ తెగుల వ్యాప్తికి( Pests ) అనుకూలంగా ఉంటాయి.
పెసర మొక్క ఆకులు, కాండం, కాయలపై పౌడర్ లాంటి తెల్లని మచ్చలు( White Spots ) ఏర్పడితే ఆ మొక్కకు బూడిద తెగుళ్లు ఆశించినట్టే.
ఈ తెగుళ్లు ఆకుల ఉపరితలంపై, ఆకుల కింది భాగంపై కూడా కనిపిస్తాయి.ఈ తెగులు పంటను ఆశించడం వల్ల మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ( Photosynthesis ) ఆగి, ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి.
కొన్ని ఆకులు వంకర్లు తిరిగి, విచ్ఛిన్నం చెంది రూపం కోల్పోతాయి. """/" /
ఈ తెగుళ్లు పెసర పంటను ఆశించకుండా ఉండాలంటే తెగులు నిరోధక మేలు రకం విత్తనాలను( Seeds ) ఎంపిక చేసుకుని సాగుచేపెట్టాలి.
మొక్కల మధ్య మొక్కలం వరుసల మధ్య మంచి ప్రసరణ ఉండేలా కాస్త ఎక్కువ దూరంలో నాటాలి.
మొదటిసారి ఈ మచ్చలు కనిపించిన వెంటనే వ్యాధి సోకిన ఆకులను( Infected Leaves ) తీసేయాలి.
పంట మార్పిడి చేస్తూ ఉండటం వల్ల తెగుల ప్రభావం పంటపై తక్కువగా ఉంటుంది.
"""/" /
పంట కోతల అనంతరం పొలంలో అవశేషాలన్నీ పూర్తిగా తొలగించాలి.వేసవి కాలం రాగానే లోతు దుక్కులు దున్నుకోవాలి.
సేంద్రియ పద్ధతిలో ఈ తెగులను అరికట్టాలంటే గంధకం, వేప నూనె, ఆస్కార్బిక్ యాసిడ్ లాంటి వాటిని పిచికారి చేయాలి.
రసాయన పద్ధతిలో ఈ తెగులను అరికట్టాలంటే.నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
అక్కడ కూడా సత్తా చాటిన బాలయ్య.. ఇకపై సరికొత్త రికార్డ్స్ క్రియేట్ కానున్నాయా?