జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆదివారం కాపులతో భేటీ కావడం తెలిసిందే.ఈ సమావేశంపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఎవరికి తెలియదని సెటైర్లు వేశారు.ఆయన లక్ష్యం లేని వ్యక్తి అని… సిద్ధాంతాలు కూడా లేవని విమర్శించారు.
నెలలో హైదరాబాదు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు రోజులు మాత్రమే వచ్చి… ఏవేవో మాట్లాడి మళ్లీ విమానం ఎక్కి వెళ్ళిపోతారని ఎద్దేవా చేశారు.పవన్ ఉపన్యాసాలు మొత్తం సినిమా డైలాగులే అని సెటైర్లు వేశారు.
కాపుల కోసం పవన్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.అసలు ఏ సిద్ధాంతాన్ని చూసి పవన్ కళ్యాణ్ కి ఓట్లు వేయాలని నిలదీశారు.
పవన్ కళ్యాణ్ కీ కులాలపై అవగాహన లేదని అన్నారు.రాజకీయాల్లో ఆస్కార్ అవార్డు ఉండి ఉంటే… ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ గెలుచుకునేవాడని సెటైర్లు వేశారు.లోపాయి గారి ఒప్పందాలకు దూరమని చెప్పే పవన్… 2012 నుంచి ఎవరెవరితో ఒప్పందాలు చేసుకున్నారు.? 2014లో చంద్రబాబు (Chandrababu Naidu)కి ఊడిగించేసింది ఎవరు.?.2019 ఎన్నికల ముందు బిజేపినీ విమర్శించి ఎన్నికల తర్వాత అదే బీజేపీనీ.కలిసింది ఎవరు.? అని పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు.ఇక రాబోయే సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ లో ఇంకా చాలా రంగులు బయటపడతాయని… పవన్ నీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.