ఎవ్వరితో రిలేషన్ వద్దు...ఒంటరితనము నాకిష్టం అనుకునే ప్రతి ఒక్కరు ఇది తప్పక చదవండి.! మీ ఆలోచన మారుతుంది.!

ఒకసారి తొమ్మిది 8ని లాగి లెంపకాయ వేసింది.ఏడుస్తూ 8 "నన్నెందుకొట్టావని?" 9ని అడిగింది.

"నువ్వు నాకంటే చిన్న.

అందుకే కొట్టా." అని 9 చెప్పింది.అది వింటూనే, ఎనిమిది 7ని బలంగా ఒక్కటిచ్చింది.9 చెప్పిన కారణమే చెప్పుకొంది.

అలాగే ఏడు 6ని, ఆరు 5ని, ఐదు 4ని, నాలుగు 3ని, మూడు 2ని, రెండు 1ని లెంపకాయలు వేశాయి.1కి క్రింద 0 వుంది.1మాత్రం అలాచేయక ప్రేమగా 0ని తన పక్కన నిలబెట్టుకుంది.1 విలువ 10 ఐపోయింది.ఇప్పుడు భయపడడం 9 వంతైంది.

జీవితంలో ఎవరో ఒకరు మన ప్రక్కన నిలబడాలి.(వారెవరన్నది ముఖ్యం కాదు.

Advertisement

) భుజం తట్టి చెయ్యి వేసేవారు వుండాలి.అనుబంధాన్ని మించిన విలువ జీవితంలో లేదు.

మంచి వాళ్ళతో అనుబంధాన్ని అస్సలు వదులుకోకండి.!.

Advertisement

తాజా వార్తలు