పార్లే-జీ బిస్కెట్ల కోసం క్యూ కట్టిన జనాలు.. ఎందుకంటే..!?

ఈ మధ్యకాలంలో జనాలు పుకార్లను ఎక్కువగా నమ్ముతున్నారు.మూఢనమ్మకాల మత్తులో పడి మరికొందరు విచిత్రమైన పనులను చేస్తున్నారు.

 People In Queue For Parle G Biscuit Packets In Bihar State, Parlg, Biscuits, Lat-TeluguStop.com

ఒక కొడుకు ఉన్నవారు ఇలా చేయాలని, అలా చేయకూడదని, అలాగే కూతుళ్లు ఉన్నవారు ఏం చేస్తే వారికి కీడు తొలగుతుందని.ఇలా రకరకాల మూఢ విశ్వాలసాలతో ఏవేవో పనులు చేస్తున్నారు.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి బీహార్ లో చోటుచేసుకుంది.పార్లే జీ బిస్కెట్ కోసం బీహార్ రాష్ట్రంలో జనాలు క్యూ కట్టారు.

ఎక్కడ చూసినా స్టాక్ లేదని దుకాణాలు బోర్డులు పెట్టేశారు.ఇంతకీ ఆ పార్లే జీ బిస్కెట్ కు డిమాండ్ ఎందుకు పెరుగుతుందో తెలుసా? దానికొక బలమైన పుకారు ఉంది.ఆ పుకారు వల్లే పార్లేజీ బిస్కెట్ కోసం జనాలు ఎగబాకారు.పార్లేజీ బిస్కెట్ అంటే అదొక పేదవాళ్ల బిస్కెట్.తక్కువ ధరకే ఆ బిస్కెట్ లభించడం వల్ల చాలా మంది ఆ బిస్కెట్లనే కొంటుంటారు.

ప్రస్తుతం మార్కెట్లోకి అనేక రకాల బిస్కెట్లు వచ్చాయి.

అందుకే పార్లేజీ బిస్కెట్ కు డిమాండ్ తగ్గిపోయింది.ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో సీతామర్హి జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది.

అనూహ్యంగా పార్లెజీ బిస్కెట్లకు డిమాండ్ పెరిగిపోయింది.బీహార్ లోని కొన్ని ప్రాంతాల్లో జితియా వ్రతం చేసుకోవడం ఆనవాయతీ.

దానినే జీవిత్ పుత్రికా వ్రత్ అని కూడా పిలుస్తారు.సెప్టెంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆ వ్రతాన్ని ప్రజలు వేడుకగా చేసుకుంటారు.

Telugu Bihar, Biscuits, Demandparle, Jeevitaputrika, Latest, Parlg, Seetamarghi-

ఈ పండగ చేసుకునేటప్పుడు ఆ రోజున తల్లులు ఉపవాసం ఉండి ఎంతో నిష్ఠతో పండగ చేసుకుంటారు.ఆరోజు మంచినీటిని కూడా తాగరు.తమ పిల్లలు దీర్ఘాయువుతో ఉండటం కోసం ఆ దేవునికి పూజలు చేయడం ప్రతి ఏడాది జరుగుతుంటుంది.పిల్లలకు కీడు జరగకుండా ఉండాలంటే పార్లే జీ బిస్కెట్లు తినాలనే పుకారు ఆప్రాంతంలో బాగా వినిపించడంతో అందరూ పార్లేజీ బిస్కెట్ల కోసం పోటీ పడ్డారు.

సీతామర్హి జిల్లాలో పార్లేజీ బిసెట్ల పూర్తిగా అయిపోయాయి.దీంతో దుకాణంలో నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube