తిరుపతి జిల్లా చిన్న సింగనమలలో సీఎం జగన్( CM Jagan ) మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆటో, లారీ డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖీ నిర్వహించారు.
టిప్పర్ డ్రైవర్ ను పని చేస్తున్న వీరాంజనేయులును( Viranjaneyunulu ) శింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టానని సీఎం జగన్ తెలిపారు.కోట్ల రూపాయలున్న వారికి చంద్రబాబు టికెట్లు ఇస్తే తాను సామాన్యుడికి ఇచ్చానన్నారు.
చంద్రబాబు హయాంలో వీరాంజనేయులుకు ఉద్యోగం రాకున్నా టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించారని పేర్కొన్నారు.అన్ని వర్గాల వాళ్లు చట్టసభల్లోకి రావాలన్న జగన్ టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చానని చంద్రబాబు( Chandrababu ) అవహేళన చేశారని చెప్పారు.
కానీ ఇలాంటి వారిని చట్టసభల్లో కూర్చోబెడితేనే సామాన్యుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతారని తెలిపారు.అదేవిధంగా పెన్షన్ల కష్టాలపై స్పందించిన సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు వలనే వృద్ధులు ఎండలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.