ఒక పులి తేలికగా ఆహారం సంపాదించడం కోసం ఒక బాటసారిని చంపేసి అతని వద్ద వున్న బంగారు కడియాన్ని తెచ్చుకొని బురదలో కూర్చొని నా దగ్గరకి వస్తే బంగారు కడియాన్ని ఇస్తానంటూ ఆశ పెడుతుంది.నిజమేనని బంగారు కడియం కోసం ఆశ పడి పులి దగ్గరకు వెళ్లిన వారికి ఏ గతి పట్టిందో, జగన్ మాటలు నమ్మి ఓట్లేసి అధికారం అప్పగించిన ప్రజలకు అదే గతి పట్టింది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార దినోత్సవ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును నమ్మకండి.తన ప్రభుత్వాన్నే నమ్ముకోవాలని పదే,పదే ప్రజలను వేడుకొన్నారు.
చంద్రబాబు తన 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చెయ్యలేని విధంగా తన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసి చూపిస్తుంది అని చెప్పుకొన్నారు.గతంలో వారి పాలన చూసి ప్రజలు ఇదేమి పాలన అంటూ అన్నిఎన్నికల్లో చంద్రబాబు ను ఓడించి భై,భై చెప్పారని వెటకారం చేశారు.
నన్నుమాత్రమే నమ్మ మంటున్నారు జగన్ రెడ్డి. మిమ్మల్ని ఎందుకు నమ్మాలో సమాదానం చెప్పగలరా ముఖ్యమంత్రి ? ప్రజలు నమ్మి అద్భుతమైన అధికారం ఇస్తే ఏమి మహాద్భుతాలు చేశారని మిమ్మల్ని నమ్మాలి? రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ది చేస్తానని అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, రాష్ట్రం కోలులోలేని విధంగా నాశనం చేసినందుకు నమ్మాలా? గత ఎన్నికల్లో నన్ను నమ్మండి ఒక్కచాన్సుఇవ్వండి అని మీ వేడుకోళ్ళకు ఆకర్షితులై ప్రజలు ఒకసారి మోసపోయ్యారు.ఆత్మ ద్రోహానికి,అబద్దాలకు అలవాటు పడిన మీరు మళ్లి నమ్మండి అంటూ వేడు కోళ్లు మొదలు పెట్టారు.మూడున్నరేళ్ళ తన పాలనను చూసి తానే మురిసిపోవడం చూస్తుంటే గురివింద తన అందాన్ని చూసి తానె గొప్పగా వర్ణించుకొన్నట్లు వుంది.
తన ప్రభుత్వం గతంలో ఎవ్వరు చెయ్యని విధంగా కార్యక్రమాలు చేస్తుందని గొప్పలు చెప్పారు జగన్ రెడ్డి. మరి మీ పరిపాలన అంత అద్భుతం అయితే బటన్ నొక్కుడు బహిరంగసభల్లో మీరు నోరు తెరవగానే జనం గోడలు దూకి ఎందుకు పారిపోతున్నారు? ముఖ్యమంత్రి సభలకు తీసుకు వస్తున్న జనం మధ్యలో వెళ్లిపోకుండా పోలీసులను కాపలా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది.తమ సభలకు డ్వాక్రాసంఘాల మహిళలను,పింఛను దారులను బెదిరించి ఎందుకు తీసుకు రావాల్సివస్తుంది.ప్రజలకు మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం అని చెప్పుకొంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ మంచి పనులు అంటే ఏమిటోఒక్కటి చెప్పగలరా? చంద్రబాబు భయపడుతున్నారు అన్నారు.ముఖ్యంమంత్రిగా జనంలోకి పోవాలంటే కిలోమీటర్లు కొద్దీ బారికేడ్లు నిర్మించుకొని, పరదాలు కట్టుకొని ఎందుకు ప్రజల్లోకి పోవాల్సివస్తుంది.వేలమంది పోలీసులను నియమించుకొని ఎందుకు వెళ్లాల్సి వస్తుంది.తమ పర్యటన వున్నచోట్ల రెండు రోజులు ముందే షాపులు ఎందుకు మూయిస్తున్నారు.

ఎవరు చెయ్యని విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పారు.కానీ గడప లోపలే మీ భోగమంతా అని అర్ధం అయిందిప్రజలకు.ఎన్నోకార్యక్రమాలుచేస్తే, పరిపాలన అద్భుతం అయితే గడప,గడప లోఎందుకు ఛీత్కరిస్తున్నారు?ప్రజాస్వామ్యాన్ని పెళ్లగించి మాఫియా పాలన సాగిస్తున్నారు.ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడం మీడియా బాధ్యత.తప్పులను ఎత్తి చూపుతున్న మీడియా వ్యవస్థలను దుష్ట చతుష్టయంగా వర్ణించి తమ తప్పులు కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
పరి పాలన చేతకాక ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా పాలనా వైపల్యాలకు మీడియా వ్యవస్థలను నిందించడం ఏమిటి?ప్రజలు ఎదోర్కొంటున్న ప్రతి సమస్యకు మీడియానే కారణమా? అసమర్ధ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టి పోవడానికి మీడియా నే కారణమా ? నిజాలు రాస్తే,చూపిస్తే ఉలుకెందుకు? ప్రజల తలరాతలు మారుస్తానని ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన జగన్ పరిపాలన పై మూడున్నరేళ్లు సరికి ప్రజల భ్రమలు తొలగిపోయాయి.జగన్ కి పరిపాలన చేతకావడం లేదని నిరూపితం అయింది.
ప్రజాశ్రేయస్సు పట్టించుకోకుండా జనాకర్షక పథకాలతో,ఓటు బ్యాoకు రాజకీయాలతో పబ్బంగడుపు కొంటున్నారు.

జగన్ 42 నెలలుగా నిరంకుశ,పాసిష్ఠు పాలనతో,అరాచకంతో రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ రెడ్డి ఇంకా నన్నే నమ్మండి అంటే ప్రజలు ఎలా నమ్మాలి? అట్లాగే అన్ని ఎన్నికల్లో ఓడించి చంద్రబాబు కు భై,భై చెప్పారు.అందుకే ఇదేమి కర్మరా అంటూ చంద్రబాబు తలపెట్టుకొని కూర్చున్నారూ అంటూ విమర్శించారు.పదే,పదే చంద్రబాబుది వెన్నుపోటు అంటూ విమర్శిస్తున్న జగన్ రెడ్డి తల్లికి,చెల్లికి వెన్నుపోటుపొడిచింది మీరు కాదా?సోనియా గాంధీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొనే వేలకోట్లు ప్రజాధనం దోపిడీ చేసి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి,సోనియా గాంధీకి వెన్ను పోటు పొడించింది మీరుకాదా?వెన్నుపోటుపై మాట్లాడే అర్హత వున్నాదా? ముఖ్యమంత్రి సభలు పెడుతున్నచోట ప్రజలకు నరకం చూపిస్తున్నారు.వేల మంది పోలీసులు,అడుగడుగునా ఆంక్షలు,కిలోమీటర్ల పొడవునా బారికేడ్లు,పరదాలు కట్టడం,దారిపొడవునా దుకాణాల మూతతో ప్రజలు,వ్యాపారులు,పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల అవస్థలు.పడుతూ ఇదేమి కర్మరా అంటూ వాపోతున్నారు.జగన్ రెడ్డి బహిరంగ సభలకు బలవంతంగా తీసుకొచ్చిన ప్రజలు కూడా ఇదేమి కర్మఅంటూ తమ అబద్దాలు,స్పష్టంగా పలకలేని నత్తి పదాలు వినలేక గోడలు,బారీకేడ్లు దూకి పారిపోతున్నారు.జగన్ బహిరంగ సభ రోజున స్కూల్స్ బంద్ చేసి పిల్లల చదువులకు ఆటంకం కలిగించడంతోఇదేమి కర్మ రా అంటూ విద్యార్థులు వాపోతున్నారు.

జగన్ మీటింగ్ కి రెండు రోజుల ముందే బారీ కేడ్లతో రోడ్లను బ్యాన్ చెయ్యడం,షాపులు మూసి వేయడంతో ప్రజలు,షాపుల యజమానులు ఇదేమి కర్మరా అంటూ అని బాధపడుతున్నారు.నన్ను నమ్మండి ఒక్కచాన్సు ఇవ్వండని మీ వేడుకోళ్ళకు ప్రజలు ఒకసారి మోసపొయ్యి ఉండవచ్చు.కానీ అన్ని సార్లు ప్రజలను మోసం చెయ్యడం సాధ్యం కాదని గుర్తించండి.గొడ్డలి వేటు తో సొంత బాబాయిని హత్యచేయించి శవానికి కుట్లువేసి గుండె పోటుగా చిత్రించి సొంత బాబాయికి బై,బై చెప్పిన విధంగా అన్ని సార్లు చంద్రబాబుకు బై- బై చెప్పడం సాధ్యం కాదని గుర్తించండి.
చంద్రబాబు బహిరంగ సభలకు స్వచ్ఛందంగా ప్రజలు తండోప తండాలుగా వస్తున్నారు.అర్ధరాత్రి అయినా మీటింగ్ అయ్యేవరకు ఒక్కరూ కూడా కదలడం లేదు.కానీ ముఖ్యమంత్రి జగనరెడ్డి సభలకు జన సమీకరణకు అధికారులు,అధికారపార్టీ నాయకులు చెమట ఒడుస్తున్నారు.వందలాది ఆర్టీసీ బస్సులు, ప్రవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించి స్కూలు బస్సులు పంపించి,డ్వాక్రాసంఘాల మహిళలను,పింఛనుదార్లను బెదిరించి వేలాది మందిని తరలిస్తున్నారు.