ఒక్క అవకాశానికి మోసపోయిన ప్రజలు ! బాధపడుతున్న బాబు 

వైసిపి ప్రభుత్వం( YSP Govt )పై తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడ్డారు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు( Chandrababu ).ఉమ్మడి కృష్ణాజిల్లాలో మూడు రోజులు పర్యటనలో భాగంగా నూగువీడులో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.

2019 ఎన్నికల్లో టిడిపి ( TDP )అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే , ఏపీ ప్రథమ స్థానంలో ఉండేదని , కానీ ఒక్క అవకాశం అనే వైసిపి అధినేత జగన్ ఇచ్చిన పిలుపుకు ప్రజలు మోసపోయి ఇప్పుడు బాధపడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీ ని కాపాడుకునేందుకు ప్రజలు క్విట్ జగన్.

సేవ్ ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో ముందుకు వెళ్లాలని కోరారు.

భోగాపురం విమానాశ్రయం స్టీల్ ప్లాంట్( Steel plant ) కు తాము ఎప్పుడో భూమి పూజ చేశామని,  ఈ ప్రభుత్వం వాటికి మళ్లీ భూమి పూజ చేస్తోందని,  తాను తీసుకొచ్చిన మల్లవల్లి పారిశ్రామిక వాడను పూర్తి చేసి ఉంటే 50 వేల ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు అన్నారు.ఈ సందర్భంగా పోలీసులు పైన విమర్శలు చేశారు.కొంతమంది పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని,  కొందరు తీరు వల్లే పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మసకబారుతోందని తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు హెచ్చరించారు.

Advertisement

జగన్ రుణం తీర్చుకునేందుకు కోడి కత్తి డ్రామా ఆడాడని,  సానుభూతి వస్తే ఓట్లు సీట్లు పెరుగుతాయని అలా చేశానని నిందితుడు శ్రీనివాస్ చెప్పాడని బాబు పేర్కొన్నారు.జగన్ ప్రతిపక్షంలో ఉండగా తిరుపతి పింక్ డైమండ్ ను తానే కాజేశానని అన్నారని,  అధికారంలోకి వచ్చాక అసలు పింక్ డైమండ్ అనేదే లేదని అంటున్నారని బాబు అన్నారు.ఏపీలో సరైన రోడ్లు కూడా లేవని తెలంగాణ నాయకులు విమర్శలు చేసే విధంగా ఏపీని సీఎం జగన్ నాశనం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు