12 ఏళ్ల కిందట చనిపోయిన వ్యక్తి పెన్షన్ తీసుకుంటున్నాడు.ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.
దొడ్లేరుకు చెందిన కిరిటీ అనే వ్యక్తి 2001 సంవత్సరంలో మృతిచెందాడు.అయితే తన తండ్రి బతికే ఉన్నాడని పెన్షన్ దరఖాస్తు చేశారు.
ఈ మేరకు 2011లో నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించిన కిరీటి కుమారుడు సౌరయ్య ప్రతినెలా పింఛన్ డబ్బులను కాజేస్తున్నాడని తెలిసింది.విషయం తెలుసుకున్న బంధువులే జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.