కోలీవుడ్ స్టార్ హీరో విశ్వనాయకుడు కమల్ హాసన్( kamal haasan ) ఎన్నో ఏళ్ల తర్వాత విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో కమల్ హాసన్ ఎప్పుడో ఆగిపోయిన సినిమాను కూడా మళ్ళీ రీ స్టార్ట్ చేసాడు.
కమల్ హాసన్ నుండి నెక్స్ట్ రాబోతున్న సినిమా ”ఇండియన్ 2”( indian 2 movie ).ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎన్నో అడ్డంకులను అధిగమించి మరీ మళ్ళీ మొదలైన ఈ సినిమా కోలీవుడ్ లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి బజ్ ఏర్పరుచుకుంది.ఎందుకంటే ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ చూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.శంకర్ ఎప్పటిలానే భారీ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్ లో విలన్ రోల్ గురించి ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది.ఈ సినిమాలో కమల్ హాసన్ ను ఢీ కొట్టే మెయిన్ విలన్ పాత్రలో వెర్సటైల్ నటుడు ఎస్ జె సూర్య( SJ Suriyah ) నటిస్తున్నట్టు కోలీవుడ్ లో వరుసగా వార్తలు వస్తున్నాయి.
శంకర్ ఇతడిపై సుర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ను డిజైన్ చేసాడని తన షూట్ కూడా ఇప్పటికే పూర్తి అయినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.చూడాలి ఈయన రోల్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో.
కాగా ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా.అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.