పెనమలూరు అసెంబ్లీని గెలిచి చంద్రబాబుకి కానుకగా ఇస్తాం - బోడె ప్రసాద్

కృష్ణాజిల్లా , పెనమలూరు నియోజకవర్గం: 2024 సాధారణ ఎన్నికలలో భాగంగా పెనమలూరు నియోజకవర్గం ఎన్డీఎ కూటమి అభ్యర్థిగా బోడె ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, కొనకళ్ల నారాయణ, వంగవీటి రాధా, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

 Penamaluru Constituency Nda Alliance Candidate Bode Prasad Filed Nomination, Pen-TeluguStop.com

ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ.చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వను.

పెనమలూరు అసెంబ్లీని గెలిచి చంద్రబాబుకి కానుకగా ఇస్తాం.నామినేషన్ కార్యక్రమంలో కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు.

ఎన్నికల వరకు కార్యకర్తలు ఇదే స్ఫూర్తి కొనసాగించాలి.వైకాపాను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధాకృష్ణ కామెంట్స్.ఒక వ్యక్తి నేను బటన్ నొక్కాను… నొక్కాను అంటున్నారు.

ప్రజలు కూడా కుటమి గెలుపు కోసం బటన్ నొక్కలని అంటున్నారు.కూటమి విజయం కోసం ప్రజలు సంకల్పించారు.

ఈ ప్రాంతానికి బోడే ప్రసాద్ చాలా సేవలు చేశారు.పెనమలూరు ప్రజలు బోడే ప్రసాద్ ను గెలిపించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube