పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్( Gomasa Srinivas ) కు షాక్ తగలనుందని తెలుస్తోంది.గోమాస స్థానంలో మరో వ్యక్తిని పార్టీ అధిష్టానం ఎంపిక చేయనుందని సమాచారం.
సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, ఎస్ కుమార్ పేర్లను పార్టీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు రానున్న రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది.
ఈ క్రమంలో ఇవాళో, రేపో పెద్దపల్లి బీజేపీ( BJP ) ఎంపీ అభ్యర్థి పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.

అయితే గోమాస శ్రీనివాస్ ప్రచారంలో కనిపించకపోవడంతో ఆయనపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.ఎంతో నమ్మకంతో పార్టీ అధిష్టానం టికెట్ కేటాయిస్తే.కనీసం ప్రచారం చేయకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ గోమాసపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే అభ్యర్థిని మార్చాలని స్థానిక నాయకులు అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం.
దీంతో పునరాలోచనలో పడ్డ పార్టీ హైకమాండ్ ఆయనను మార్చేందుకు రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది.







