టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా ఫరియా అబ్దుల్లా( Faria Abdullah ) నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు.జాతిరత్నాలు సినిమా( Jathi Ratnalu 0తో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన ఫరియా త్వరలో ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా ఈ సినిమా మే నెల 3వ తేదీన థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.కామెడీ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న అల్లరి నరేష్ గత కొంతకాలంగా విభిన్నమైన కథలలో నటిస్తున్నారు.
అయితే ఆ ఒక్కటి అడక్కు సినిమా( Aa Okkati Adakku ) మాత్రం అల్లరి నరేష్ టైప్ సినిమానే తెరకెక్కడం గమనార్హం.

చిట్టి( Chitti ) అనే ముద్దుపేరుతో పాపులర్ అయిన ఫరియా అబ్దుల్లా కాలికి ఉన్న టాటూ( Tattoo on Leg ) నెట్టింట హాట్ టాపిక్ అయింది.ఒక జర్నలిస్ట్ ఆ టాటూ గురించి అడగగా ఫరియా అబ్దుల్లా సమాధానం ఇచ్చారు.నా కాలిపై ఉన్న టాటూ రూట్ టాటూ( Root Tattoo ) అని వేర్లు బలంగా ఉంటే మాత్రమే మొక్క దృఢంగా నిలబడగలుగుతుందని అలాగే మనం ఎంతో ఒదిగి ఉంటేనే ఎక్కువ ఎత్తుకు ఎదుగుతామని ఆమె పేర్కొన్నారు.
సెలబ్రిటీ లైఫ్ లో ఒదిగి ఉండటం ఎంతో అవసరమని ఆ విషయాన్ని నాకు పదేపదే గుర్తు చేయాలనే ఆలోచనతో మాత్రమే నేను ఈ టాటూను వేయించుకున్నానని ఫరియా అబ్దుల్లా వెల్లడించారు.

అటు నరేష్( Allari Naresh ) కు, ఇటు ఫరియాకు ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఏపీ ఎన్నికల నేపథ్యంలో చాలా సినిమాలు వాయిదా పడుతుండగా నరేష్ మాత్రం తమ సినిమా సమ్మర్ సెలవులను క్యాష్ చేసుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఈ ఏడాది సమ్మర్ కు ప్రేక్షకులకు చిన్న సినిమాలే ఆప్షన్ కానున్నాయని చెప్పవచ్చు.







