ఎండకు తట్టుకోలేక పడిపోయిన నెమలి....సెలైన్ ఎక్కించారు

ఎండకు తట్టుకోలేక పడిపోయిన నెమలి.సెలైన్ ఎక్కించారు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దీ రోజులు గా ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ ఎండల తాపానికి అటు జనాలు తట్టుకోలేక పోతున్నారు.ఈ క్రమంలో 17 మంది ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు.

అయితే ఈ ఎండల కారణంగా మనుషులే కాకుండా మూగ జీవాలు కూడా పడరాని ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో మన జాతీయ పక్షి నెమలి వేడిగాలి తట్టుకోలేక ఎక్కడ నీరు కనపడితే అక్కడ వాలిపోతుంది.

ఈ ఘటన జనగామ శివారు లో చోటుచేసుకుంది.వేడి గాలులు తట్టుకోలేక ఒక నెమలి బోరు వద్ద వస్తున్న నీటి వద్దకు వెళ్లి.

Advertisement

కాసేపు సేదతీరింది.అయినప్పటికీ పాపం ఆ నెమలి అది స్పృహ కోల్పోయిందట.

దీనితో అక్కడి స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడం తో ఆంబులెన్స్ ను తీసుకువచ్చి వెంటనే ఆ నెమలి కి చికిత్స అందించారు.ఈ క్రమంలో ఆ నెమలి కి సెలైన్ కూడా పెట్టాల్సి వచ్చిందట.

అయినా ఈ ఎండలకు ప్రజలే తట్టుకోలేక పోతుంటే పాపం మూగ జీవాలు అవి మాత్రం ఎంత అని తట్టుకుంటాయి.అందుకే ఆ మూగ జీవికి కూడా సెలైన్ ఎక్కించాల్సి వచ్చింది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు