ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి..ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.వైసీపీ-టీడీపీ గుండాల మధ్య జరుగుతున్న యుద్ధాలు హత్యలు సృతిమించాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Prajashanti Party President KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Peace And Security Has Completely Deteriorated In Ap Prajashanthi Party Presiden-TeluguStop.com

వీరి వల్ల ఏపీలో కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి పోతున్నాయి.నిరుద్యోగుల సంఖ్య కోటికి చేరుకుందన్నారు.

ఏపీలో అనేక జిల్లాల వారు నన్ను కలిశారని, జీతాలు రావటం లేదని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారని పాల్ అన్నారు.సీఎం జగన్(CM Jagan) అమరావతిపై చట్టబద్దంగా అవినీతికి అక్రమంగా దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

ప్రధాని మోదీ(Prime Minister Modi) తెలుగు రాష్ట్రాలకు(Telugu States)అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.మోడీకి నాకు మధ్య గొడవ జరిగిందని వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు(TDP leader and former CM Chandrababu) ఏం చేసినా కొడుకు కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదు అన్నట్లు ఉందని ఆరోపించారు.

లక్షల కోట్లు అప్పు చేసిన జగన్‎కి మళ్లీ పాలన ఇస్తే ఇబ్బంది పడాల్సివస్తుందన్నారు.

ఏపీలో 100కి 60 శాతం ప్రజలు నన్నే కోరుకుంటున్నారని పాల్ అన్నారు.చంద్రబాబు, జగన్‎ని(Jagan) గెలిపిస్తే బీజేపీని గెలిపించినట్టేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు (Chandrababu) ఇక సీఎం కాలేరని, టీడీపీ, వైసీపీ, జనసేనకు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ 30 నిమిషాల సమయం ఇస్తే.

రాష్ట్రం అప్పు తీర్చి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానన్నారు.నన్ను గెలిపిస్తే ఏపీ ప్రజలకు మంచి రోజులు వస్తాయి.

కుల కుటుంబ పార్టీలకు ఓటేస్తే నష్టమే తప్ప లాభం లేదని రాష్ట్ర ప్రజలకు అర్దం అవుతోందని అన్నారు.జగన్ ఎన్నికల ముందు 25 మంది ఎంపీలు ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్నారు.

ఇపుడు జగన్, చంద్రబాబు మోదీకి మసాజ్‎లు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలుగు వారి సత్తా చాటాల్సిన చాలా అవసరం ఉందని కెఏ పాల్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube