అనంతపురం: టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం.ఆరు నెలలుగా ఓట్ల తొలగింపు పై చర్చ జరుగుతున్నా…వారం రోజుల్లో జరిగిన పరిణామాల పై సీఈసీ స్పందించింది.
మా పోరాటం ఫలించింది.కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
నిన్న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఓ వ్యక్తి ఎక్కడైనా 5 కంటే ఎక్కువ డిలీశన్ కి పెడితే ఈ అర్ ఓ పర్సనల్ గా వెరిఫై చేయాలి.బల్క్ అప్లికేషన్స్ పై ముగ్గురు మెంబర్ల కమిటీ తో 100 శాతం ఓట్లను ఈ ఏ ఆర్ తో వెరిఫై చేయించాలి.
అభ్యంతరం తెలిపిన వ్యక్తి ని అక్కడికి పిలుచుకుపవాలి.తొలగించాల్సిన వ్యక్తి కి నోటీసు ఇచ్చి కమిటీ శాటిస్ ఫై అయితేనే ముందుకు వెళ్లాలి.
ఈ అర్ ఓ పర్సనల్ గా నోటీసు ఇచ్చి ప్రక్రియ ప్రకారం తొలగించాలి.సీఈసీ మార్గదర్శకాలు ప్రకారం బల్క్ గా వస్తే ఓట్లు తొలగించడం కుదరదు.
ఎవరైనా తప్పుడు అలిగేషన్ చేస్తే… అభక్టర్ మీద ఏడాది కాలం పాటు శిక్ష పడే విధంగా మార్గదర్శకాలు ఇచ్చింది.
గతం లో ఇలాంటి ఘటన విశాఖ లో జరిగితే కెంద్ర ఎన్నికల సంఘమే కేసులు నమోదు చేయండి అని ఆదేశాలు ఇచ్చింది.
ఈ విషయం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి.ఇప్పుడు ఉన్న బీఎల్ ఓ లు సచివాలయం సెక్రెటరీలు.అధికార పార్టీ చెప్పిన విధంగానే చేస్తున్నారు.దాని ఫలితమే ఇద్దరు అధికారుల సస్పెన్షన్.
ఇది కేసులో ఆరంభం మాత్రమే.కింది స్థాయి లో తప్పు చేసిన అధికారిపై చర్యలు తప్పవు.
క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.గతం లో మంచి వాతావరణం లో ఇదే అధికారులు, సిబ్బంది పనిచేశారు.
ఇప్పుడు బాస్ ఇజం నడుస్తోంది… అధికారులు చేసే తప్పులు వారి మెడకి చుట్టుకుంటాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఓ స్వాతంత్ర సంస్థ.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు చేసే సంస్థ కాదుఅత్యుత్సాహం తో పనిచేసిన 8 మంది బీఎల్ ఓ లు ఉరవకొండ లో సస్పెండ్ అయ్యారు.తప్పులు చేయండని ఒత్తిడి తెస్తే.
అధికారులు లొంగవద్దు.సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఆధార్ లేకుంటే ఓటు తొలగించాలని ఎక్కడా లేదు.అధికారులు కావాలని తప్పులు చేస్తే ఉదోగుల జాబితాలో మీ పేరు లేకుండా పోతుంది.
కొందరు అధికారులు సొంత మార్గదర్శకాలు ఇస్తున్నారు.ఇది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు.
2022 నుంచి ఓట్ల తొలగింపు జరిగింది అని నేను చేసిన ఫిర్యాదు పై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపడుతున్నారు.తొలగించిన ప్రతి ఓటు ను వెరిఫై చేయమని ఆదేశాలు ఇచ్చింది.
కలెక్టర్ లు టీమ్ లు ఫర్మ్ చేస్తున్నారు.ఎన్నికల సంఘం ఓటుకి, ఓటరు కి ఇచ్చే ప్రాధాన్యం గొప్పది.
ఊరిలో లేక పోతే ఓట్లు తీసేయండి ని అంటున్నారు.దానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి.
సీఎం జగన్ పుట్టినప్పటి నుంచి పులివెందుల లో ఉన్నారా… 30 ఏళ్లుగా సీఎం బయట ఉన్నా పులివెందుల లో ఎందుకీ ఉంది.మీ లెక్క ప్రకారం ఆయన ఓటు ఆక్కడ ఉండడం నేరం.
ఆరు నెలలు లేకుంటే తొలగించమని ఆదేశం ఈసీ తీసేసి ఏడాది దాటి పోయింది.