అవకాశం ఇస్తే ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాను అంటున్న పాయల్ రాజ్ పుత్!

అందం మరియు టాలెంట్ రెండు ఉన్నప్పటికి కూడా సరైన సక్సెస్ లేక రేస్ లో వెనకబడిన హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో పాయల్ రాజ్ పుత్ ( Payal Rajput )పేరు కచ్చితంగా ఉంటుంది. ‘RX 100’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె తొలిసినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించింది.

 Payal Rajput Says He Would Marry That Star Heroine If Given A Chance , Payal Ra-TeluguStop.com

ఆ తర్వాత ఈమెకి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ, స్క్రిప్ట్ ఎంపికలు సరిగా లేదు.ఫలితంగా వరుస డిజాస్టర్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది.

అయితే తనతో ‘RX 100’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తీసిన అజయ్ భూపతి తో మళ్ళీ సినిమా చెయ్యాలని చాలా పట్టుబట్టింది.తన కెరీర్ మలుపు తిప్పే సినిమాని ఇవ్వాల్సిందిగా అజయ్ భూపతి ని కోరిందట.

అప్పుడు ఆమె చేతికి ‘మంగళవారం’ ( Mangalavaram Movie )స్క్రిప్ట్ వచ్చింది.రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ వచ్చింది.

Telugu Ajay Bhupathi, Kareena Kapoor, Mangalavaram, Payal Rajput, Rx, Tollywood-

కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 13 కోట్ల రూపాయలకు జరిగింది.ఇది పాయల్ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ అని చెప్పొచ్చు.మొదటి రోజు ఓపెనింగ్స్ ని చూసి అసలు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందా అనే అనుమాన పడ్డారు ట్రేడ్ పండితులు.

కానీ వరల్డ్ కప్ ఫైనల్స్ మేనియా లో కూడా ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది.ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 7 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి.ఈ వీకెండ్ కి ఆ మార్కుని అందుకొని సూపర్ హిట్ రేంజ్ కి వెళ్తుందని అంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో,చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Telugu Ajay Bhupathi, Kareena Kapoor, Mangalavaram, Payal Rajput, Rx, Tollywood-

ఆమె మాట్లాడుతూ ‘నాకు కరీనా కపూర్( Kareena Kapoor ) అంటే చాలా ఇష్టం.ఆమెతో కలిసి ఒక సెల్ఫీ దిగడానికి చాలా కష్టం అయ్యింది.నాకు ఆమె అంటే ఎంత ఇస్తామంటే, నాకు ఒకవేళ అవకాశం దొరికితే ఆమెని పెళ్లి చేసుకుంటా, అంత ఇష్టం’ అంటూ కామెంట్స్ చేసింది.

ఒక అమ్మాయి అయ్యుండి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమిటి, పిచ్చి ఏమైనా పట్టిందా నీకు అంటూ పాయల్ రాజ్ పుత్ ని సోషల్ మీడియా( Social media ) లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.తనకి ఆమె మీద ఉన్న ఇష్టాన్ని పాయల్ అలా ఉదాహరించింది , దీనికి అంత రచ్చ చెయ్యాల్సిన అవసరం లేదని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube