ఆర్ఎక్స్ 100 సినిమా( RX100 ) తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్.అజయ్ భూపతి దర్శకత్వం లో రూపొందిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాయల్ రాజ్ పూత్ అయిదు సంవత్సరాల పాటు వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.
అయితే ఈ అమ్మడి యొక్క కెరీర్ ఈ మధ్య కాలంలో డల్ గా ఉంది అనుకుంటున్న సమయంలో మరోసారి అజయ్ భూపతి దర్శకత్వం లో సినిమాను చేసే అవకాశం దక్కింది.ఈసారి కూడా పాయల్ రాజ్ పూత్( Payal Rajput ) కి దర్శకుడు అజయ్ భూపతి విభిన్నమైన పాత్రను ఇచ్చినట్లుగా ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ చూస్తూ ఉంటే అనిపిస్తోంది.
భారీ అంచనాల నడుమ ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు దర్శకుడు తీసుకు రాబోతున్నాడు.
ఈ సినిమా ఫలితం కనుక పాజిటివ్ గా ఉంటే కచ్చితం గా హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ కి మరో అయిదు సంవత్సరాల పాటు హడావుడి ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఓ రేంజ్ లో అవకాశాలతో దూసుకు పోతున్న పాయల్ రాజ్ పూత్ కి బ్రేక్ పడింది.ఇప్పుడు మంగళవారం( Mangalavaram ) తో మళ్లీ జోరు కంటిన్యూ అయ్యే అకవాశాలు ఉన్నాయి.
ఒక వైపు మంగళవారం సినిమా కు పాజిటివ్ టాక్ రావడంతో పాటు మరో వైపు సినిమాకు పెద్ద సినిమాల నుంచి పోటీ లేకపోవడంతో మినిమం పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉంటాయి అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అజయ్ భూపతి( Ajay Bhupathi ) కి కూడా ఈ సినిమా ఓ మంచి విజయాన్ని తెచ్చి పెడితే యంగ్ హీరోలు, స్టార్ హీరోలు ఈయన వైపు చూసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.ఏం జరుగుతుందో చూడాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.