మహారాష్ట్ర రాజకీయా( Maharashtra)ల్లో ఇటీవల ఎన్సీపీ పార్టీకి సంబందించిన అంశం ఏ స్థాయిలో వార్తల్లో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఆ పార్టీలో ముఖ్య నేతగా కొనసాగిన అజిత్ పవార్( Ajit Pawar ) ఎవరు ఊహించని రీతిలో పార్టీలో చీలిక తెచ్చి దాదాపు 30 మంది ఎమ్మెల్యేలతో సహ షిండే శివసేన వర్గంలో చేరిన సంగతి విధితమే.
ఆ తరువాత నుంచి శరత్ పవార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్సీపీ తీవ్రంగా బలహీన పడింది.దాంతో పార్టీ బలోపేతం కోసం శరత్ పవార్ గట్టిగానే శ్రమిస్తున్నారు.
అయితే ఆయన విపక్షాల తరుపున మద్దతు తెలుపుతారా లేదా ఎన్డీయే కూటమిలో చేరతారా ? అనేది ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న.

ఎందుకంటే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా రాష్ట్రం ఎన్సీపీ ( శరత్ పవార్ వర్గం ) బలపడే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి.దాంతో ఆయన ఏదో ఒక కూటమికి మద్దతు తెలపల్సిన అవసరత ఉంది.అయితే బీజేపీ దుర్మార్గపు పార్టీ అని ఆ పార్టీతో కలిసి నడిచే ప్రసక్తే లేదని శరత్ పవా( Sharad Pawar )ర్ గతంలోనే స్పష్టం చేశారు.
దాంతో విపక్ష కూటమికే పవార్ మద్దతు తెలుపుతాడనే వాదన పెరిగింది.దానికి తగట్లుగానే విపక్షలు ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో పాల్గొన్నారాయన.అయితే తాజాగా ఆయన మోడీతో పాటు ఒకే వేధిక ను పంచుకోవడం చర్చనీయాంశం అయింది.

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మోడీకి పుణెలో జరిగిన కార్యక్రమంలో లోక్ మాన్య అవార్డ్ అందుకున్నారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శరత్ పవార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.దీంతో మోడీ మరియు పవార్( Narendra Modi ) ఒకే వేధికపై కనిపించడంతో పలు చర్చలకు తావిస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విపక్షాల కూటమి INDIA తో ఉండడం కన్నాఎన్డీయేలో చెరడమే బెటర్ అని పవార్ భావిస్తున్నారా ? అనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి.ఒకవేళ నిజంగా పవార్ ఎన్డీయే కు మద్దతు తెలిపేందుకు సిద్దపడితే అందుకు బీజేపీ అధిష్టానం అంగీకరిస్తుందా అనేది చూడాలి.
ఒకవేళ బీజేపీ పెద్దలు అంగీకరిస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పరిణామం రూపు దిద్దుకున్నట్లేనాని విశ్లేషకులు చెబుతున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి.







