ప్రశ్నించు, పోరాడు లాంటి బలమైన నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన జనసేన.అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణాలో కానీ చెప్పుకొదగ్గ స్థాయిలో బలపడలేదు.ప్రశ్నించడానికే వస్తున్నా.అని చేప్పిన సేనాని సైతం.పార్టీ పెట్టి, మొదటి ఎన్నికల్లో పోటీ చేయకుండా.కేవలం బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చి మిన్నుకుండిపోయారు.
అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి వదవులు తీసుకోకుండా సైలెంట్ అయ్యారు.తర్వాత 2019లో కమ్యూనిస్టు పార్టీలతో కలసి టీడీపీకి దూరంగా సొంతంగా పోటీ చేశారు.
అయితే ఒక్క రాజోలు మినహా ఎక్కడా పెద్దగా ప్రబావం చూపలేదు.దాంతో ఆయన కొన్ని రోజులు రాజకీయాలకు దూరమయ్యారు.
సినిమాలు చేసుకుంటూ.అప్పుడప్పుడూ సేవా కార్యక్రమాల పేరుతో బయట కనిపించారు.
దాంతో కొంత కాలం జనసేన కనిపించకుండా పోయింది.దానికి తోడు స్థానిక ఎన్నికల సమయంలో కూడా సేనాని పెద్దగా మాట్లడలేదు.
దాంతో కేడర్ మొత్తం సైలెంట్ అయిపోయింది.ఇక ఏపీలో ముందస్తు రాగం వినిపించడంతో ఆయన కూడా అలెర్ట్ అయ్యారు.
దాంతో ఎప్పటికప్పుడు పార్టీని ఫామ్ లోకి తెచ్చేందుకు కార్యక్రమాలను ముందేసుకున్నాడు.
మొదట రైతు వర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కౌలు రైతుల సమస్యను తీసుకున్నారు.
దానితో పాటు రాజకీయాల్లో రాణించాలంటే.ఒక సామాజిక వర్గం సపోర్టు కచ్చితంగా ఉండాలని పవన్ భావిస్తున్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఆయన కులాన్ని పెద్దగా పట్టించుకోక పోయినా.రాను రాను దాని ఆవశ్యకతను తెలుసుకున్నారు.
దాంతో ఏపీలోని తన సొంత సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు ఓట్లు చాలా కీలకం కావడంతో.వాటిని ఎలాగైనా పార్టీకి ప్లస్ గా చేసుకోవాలని చూస్తున్నారు.దానికి తోడు ఉత్తరాంధ్రాలోని తూర్పుకాపులు, ఒంటరి, తెలగ.
మున్నూరు కాపులను తన ఖాతాలో వేసుకుని బలమైన ఓటు బ్యాంకుతో ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు.అంతే కాకుండా.
వైసీపీ నేతలు పవన్ ను కులం విషయంలో టార్గెట్ చేస్తుండటంతో.కాపులు సేనానిని ఒక వంగవీటి మోహన రంగాలా ఓన్ చేసుకుంటున్నారు.
అది సేనానికి కొత్త ఓటు బ్యాంకును తెచ్చి పెడుతోంది.ఇదే మిగతా ప్రాంతాల్లో జనసేనకు మైనస్ గా మారుతోంది.
జనసేన నేతలు కూడా కాపులకు పెద్ద పీఠ వేస్తుండటంతో.ఆ పార్టీపై మెల్లిగా కుల ముద్ర పడుతోంది.
ఇది ఇలాగే కంటిన్యూ అయితే.రానున్న రోజుల్లో జనసేనకు ప్లస్ అవుతుందా.? లేక మైనస్ గా మారుతుందా తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది.







