టాలీవుడ్ బ్యూటీ హన్సికకు తాజాగా ఓ నెటిజన్ షాక్ ఇచ్చాడు.పెళ్లయి నెల కూడా కాలేదు అప్పుడే భర్తకి విడాకులు ఇచ్చేసేయ్ అంటూ సలహా ఇచ్చాడు.
ఇంతకు అసలు ఏమైందో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని ఓ వెలుగు వెలిగింది హన్సిక.
ఇక తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది ఈ వైట్ బ్యూటీ.
తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2001లో చిన్న వయసులోనే అడుగు పెట్టింది.బాలనటిగా పలు సినిమాలలో నటించింది.
తర్వాత బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించింది.ఇక 2007లో హీరోయిన్ గా తన పరిచయాన్ని పెంచుకుంది.
అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.
తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.చాలా వరకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది.అంతేకాకుండా ఎక్కువ కాలం కొనసాగ లేకపోయింది.
అయినా కూడా ఇప్పటికీ ఈమెను తెలుగు ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు.

ఇక తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం టచ్ లో ఉంటుంది.దీంతో ఫ్యాన్స్ ఆమెను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఆమె నుండి వచ్చే అప్డేట్లను తెలుసుకుంటారు.అయితే ఇటీవలే ఈ బ్యూటీ తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ చాలా హ్యాపీగా ఉంది కానీ తన ఫ్యాన్స్ మాత్రం చాలా నిరాశలో ఉన్నారు.పైగా ఆమెపై నెగటివ్ కామెంట్లు కూడా చేశారు.
కారణం ఏంటంటే ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు తన ఫ్రెండ్ మాజీ భర్త.తన ఫ్రెండ్ అతన్ని మొదట పెళ్లి చేసుకోగా ఆ తర్వాత కొంతకాలానికి విడిపోయారు.
తర్వాత హన్సిక అతడితో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది.తన ఫ్రెండ్ పెళ్లప్పుడు కూడా హన్సిక అక్కడికి వెళ్లి బాగా సందడి చేసిందని తెలిసింది.

కానీ తన ఫ్రెండ్ భర్తనే హన్సిక పెళ్లి చేసుకోవడంతో బాగా కామెంట్స్ వచ్చాయి.హన్సిక మాత్రం అవేవి పట్టించుకోకుండా పెళ్లి జీవితాన్ని బాగా హ్యాపీగా గడుపుతుంది.తన భర్తతో ట్రిప్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది.పైగా తాము సందడి చేసిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.అందులో తను చాలా హ్యాపీగా కనిపించింది.
అయితే ఆ పోస్ట్ ను చూసిన నెటిజన్స్ కొందరు లైక్స్ కొట్టగా మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.ఇక ఓ నెటిజన్ మాత్రం.
బాగున్నావు.కానీ అతడికి విడాకులు ఇచ్చేసేయ్.
అతడు నీ అందానికి అస్సలు సెట్ కాడు అంటూ సలహా ఇచ్చాడు.ఇక ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.







