ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పవన్ చేతుల్లో పెట్టారా ?

తెలంగాణలోనూ, ఆంధ్రాలోనూ బిజెపి అధ్యక్షుల నియామకం చేపట్టాలని గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ దూకుడుకు బ్రేక్ వేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగల నాయకుల కోసం చాలా రోజులుగా బిజెపి అధిష్టానం కసరత్తు చేస్తోంది.

తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని పొందేందుకు చాలామంది నాయకులు పోటీ పడుతున్నారు.బీజేపీ అధిష్టానం మాత్రం ఎంపీలు బండి సంజయ్ లేదా ధర్మపురి అరవింద్ అవకాశం ఇవ్వాలని చూస్తోంది.

ఈ సంగతి ఇలా ఉంటే, ఇక ఏపీలోనూ బిజెపి అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నాయకులు విష్ణుకుమార్ రాజు, పురంధరేశ్వరి, ఎమ్మెల్సీలు పీపీఎన్ మాథవ్, సోము వీర్రాజు బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇలా లిస్ట్ చాలా పెద్దగానే ఉంది.అయితే అధిష్టానం మాత్రం ఏపీలో అధ్యక్షుడు ఎంపిక విషయంలో తొందర పడకూడదు అని నిర్ణయించుకుంది.అందుకే ఆలోచించి సమర్థుడైన నాయకుడిని ఎంపిక చేయాలని చూస్తోంది.

Advertisement

గత ఎన్నికలకు ముందు బిజెపి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి.వైసిపి టిడిపి ఏపీ లో బలంగా ఉండడడం వైసీపీ రెడ్ల పార్టీగా, టీడీపీ కమ్మ పార్టీగా ముద్ర వేయించుకోవడంతో ఈ రెండు వర్గాలు కాకుండా మిగతా వర్గాలను దగ్గర చేసుకునేందుకు, ముఖ్యంగా ఏపీలో బలంగా ఉన్న కాపు సామజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు బిజెపి కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

లక్ష్మీనారాయణ గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.ఆయనతో పాటు బిజెపి తరఫున పోటీచేసిన నాయకులందరూ రాష్ట్రవ్యాప్తంగా ఘోర ఓటమి చెందారు.చాలా చోట్ల డిపాజిట్లు కూడా ఆ పార్టీకి రాలేదు.

ఎన్నికల తర్వాత వైసీపీకి మద్దతుగా బిజెపి ఉంటుందనుకున్న కన్నా ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉద్యమాలు జరిగాయి.అయినా బిజెపికి ఆశించినంత స్థాయిలో మైలేజ్ వచ్చేలా కనిపించకపోవడంతో జనాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ పై బీజేపీ ద్రుష్టి పడింది.

అందుకే జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది.ఆయన అయితే పార్టీని ముందుకు నడిపించగలిగిన సమర్థుడని బీజేపీ నమ్ముతోంది.అందుకే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఎంపికను పవన్ కు అప్పగించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు

ఇలా చేయడం ద్వారా జనసేన బీజేపీ పొత్తుకు ఎటువంటి ధోఖా ఉండదని పవన్ కు నచ్చినవారే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటారు కాబట్టి రెండు పార్టీలు వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం అవ్వడమే కాకకుండా అధికారం చేజిక్కించుకునే అవకాశం ఏర్పడుతుందని బీజేపీ బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు