వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampalli Srinivas ) కీలక వ్యాఖ్యలు చేశారు.అందరితో కలిసి ప్రజల వద్దకు వెళ్తున్నామని చెప్పారు.
జగనన్న పథకాలు, సంక్షేమమే తమ విజయానికి దోహదపడతాయని తెలిపారు.సినిమాలో వేషాలు వేస్తున్నట్లు పవన్ రాజకీయాల్లో వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ మూడు చోట్ల పోటీ చేసినా గెలవరని చెప్పారు.

పవన్ కల్యాణ్ అవసరాన్ని బట్టి నిమిషానికి ఒక మాట మాట్లాడతారని వెల్లడించారు.మోదీ, చంద్రబాబు, లోకేశ్ ను గతంలో పవన్ కల్యాణ్్ తిట్టలేదా అని ప్రశ్నించారు.పవన్ అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారని విమర్శించారు.
చంద్రబాబును సీఎంను చేయడమే పవన్ లక్ష్యమని తెలిపారు.







