టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే జనసేన నేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన అని మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు, పవన్ లు కలిసి ఆడుతున్న నాటకమని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన దంపతలుగా కలిసి వచ్చినా చిత్తు చిత్తుగా ఓడిస్తామని మంత్రి అంబటి తెలిపారు.విపక్షాలు కావాలనే పోలవరం ప్రాజెక్టుపై అవాకులు చెవాకులు పేలుతున్నారని వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రస్తక్తే లేదని స్పష్టం చేశారు.కేవలం గొడవ చేయడానికే చంద్రబాబు పోలవరం వెళ్తానంటున్నారని మండిపడ్డారు.పోలవరం ఎత్తును 45.72 నుంచి 41.15 కి అంగీకరిస్తూ అధికారులు సంతకం పెట్టారని నాదెండ్ల మాట్లాడటం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు.







