Bhimavaram : ‘ భీమవరం ‘ లో గెలుపు ఎంత ముఖ్యమో చెప్పిన పవన్ 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భీమవరం,  గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.తన సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరిలో ఉన్న భీమవరంలో పవన్ ఓటమి చెందడాన్ని ఇప్పటికీ ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

 Pawan Said How Important It Is To Win In Bhimavaram-TeluguStop.com

దీంతో వచ్చే ఎన్నికల్లో భీమవరంలో గెలవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా పవన్ తీసుకున్నారు.ఈ మేరకు ఈ నియోజకవర్గం అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  వచ్చే ఎన్నికల్లో జనసేన( Janasena ) భీమవరాన్ని కొట్టి తీరాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.భీమవరంలో జనసేన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు.

గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తే బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారని,  ప్రచారం చేయకుండా నాకు సంకెళ్లు వేసారని ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Ap, Janasena, Janasenani, Pavan Kalyan, Pawanimportant-Politics

భీమవరంలో కంటే తాను పులివెందులలో పోటీ చేసి ఉంటే బాగుండేదని అనుకున్న , పులివెందులలో పోటీ చేసి ఓడిపోయి ఉన్న నేను బాధపడేవాడని కాదని పవన్ అన్నారు .పొత్తులో భాగంగా సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు కానీ , గతంలో నా ఒక్క సీటు గెలిచి ఉంటే ఈరోజు పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని,  గతంలో జరిగిన తప్పిదాలకు తాను పరిహారం కడుతున్నానని పవన్ అన్నారు.ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో పవన్ పై ప్రత్యర్థిగా టిడిపి నుంచి పోటీ చేసిన రామాంజనేయులు విషయాన్ని పవన్ ప్రస్తావించారు.

  భీమవరంలో( Bhimavaram ) ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి పొత్తులను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకం అయ్యారని పవన్ అన్నారు .గత ఎన్నికల్లో భీమవరం నుంచి నేను ఓడిపోతే నాపై పోటీ చేసిన రామాంజనేయులు చాలా బాధపడ్డారు.

Telugu Ap, Janasena, Janasenani, Pavan Kalyan, Pawanimportant-Politics

తాను పోటీ చేయకుండా ఉంటే బాగుండేదని రామాంజనేయులు కొద్దిమందితో అన్నారు.  గొడవలు పెంచేవారు నాకొద్దు .తగ్గించేవారు కావాలి.అందుకే రామాంజనేయులను పార్టీలోకి ఆహ్వానించాలని పవన్ అన్నారు.

  భీమవరంలో పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం కూడా ఇవ్వకుండా వైసిపి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్( MLA Grandhi Srinivas ) అడ్డుకున్నారని, నేను పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి గ్రంధి శ్రీనివాస్ అడ్డుకున్నారంటే ఎంత రౌడీయిజం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని పవన్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube