జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అధర్మాన్ని ఆశ్రయించారని మంత్రి కొట్టు సత్యనారాయణ ( Kottu Satyanarayana )అన్నారు.పొత్తులో పవన్ కల్యాణ్, చంద్రబాబు చివరివరకు ఉంటారనేది అనుమానమేనని తెలిపారు.
చంద్రబాబు రెండు సీట్లు ప్రకటించారని పవన్ కల్యాణ్ రెండు సీట్లు ప్రకటించారని మంత్రి కొట్టు పేర్కొన్నారు.ఇద్దరూ పొత్తులో ఉన్నా ఎవరిదారి వాళ్లదేనని విమర్శించారు.ఈ క్రమంలో పొత్తులు చివరి వరకు ఉంటాయో లేదో చూడాల్సిందేనని తెలిపారు.అయితే రా కదలి రా సభలో భాగంగా చంద్రబాబు ( Chandrababu )రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా దానిపై స్పందించిన జనసేనాని కూడా జనసేన తరపు నుంచి రెండు స్థానాలకు ఇద్దరి అభ్యర్థులను ప్రకటించారు.