ఎన్నార్సీ, సిఏఏపై పవన్ కళ్యాణ్ చెబితే వింటారా

ఏపీ రాజకీయాలలో సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంతో, మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని వచ్చిన పవన్ కళ్యాణ్ తాజా అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలని మెప్పించాలేకపోయాడు.

దీంతో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా ఓడిపోయాడు.

ఇదిలా ఉంటే ఎన్నికలలో ఓటమి తర్వాత మరింత స్పీడ్ పెంచిన జనసేనాని రాజకీయ లక్ష్యాల కోసం గత ఎన్నికలకి ముందు ప్రత్యేక హోదా విషయంలో విభేదించిన బీజేపీతో మళ్ళీ జత కట్టాడు.తనవి చెగువేరా సిద్ధాంతాలు, కమ్యూనిజం ఆలోచనలు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మతతత్వ పార్టీ అనే ముద్ర వేసుకున్న బీజేపీతో కలిసి పని చేయడంపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ సిద్ధాంతాలని నెత్తికి ఎత్తుకున్నాడు.కేంద్రంలో బీజేపీ ప్రవేశ పెట్టిన ఎన్నార్సీ, సిఏఏ చట్టాలని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఈ రెండు ముస్లింలకి వ్యతిరేకంగా ఉన్నాయని ఆ మతానికి చెందిన వారు కూడా బీజేపీపై విమర్శల దాడి చేస్తున్నారు.ఈ విషయంపై బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఆ పార్టీతో జత కట్టిన ప్రాంతీయ పార్టీలు కూడా భయపడుతున్నాయి.

Advertisement

ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ సపోర్టింగ్ స్టాండ్ తీసుకున్నారు.దీనిపై తాజాగా మంగళగిరిలో పార్టీ నేతలు కార్యకర్తలతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీ ల వల్ల పౌరసత్వం తీసేస్తారని ప్రజలని అన్ని పార్టీలు భయపెడుతున్నాయని, మత ప్రాతిపదికన ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.ముస్లిం సోదరుల్లో ఉన్న భయాలు, అపోహలు తొలగించేందుకు ప్రత్యేకంగా తాను ఓ సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

అసలు ఇక్కడున్న ముస్లింలకి ఈ చట్టాలతో ఎలాంటి భయం అవసరం లేదని అన్నారు.మరి ఎన్నార్సీ, సిఏఏలని గుడ్డిగా వ్యతిరేకిస్తున్న ముస్లిం సంఘాలు పవన్ కళ్యాణ్ చెబితే విని అర్ధం చేసుకుంటాయా అనే సందేహం ఇప్పుడు కలుగుతుంది.

మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.

నాగచైతన్య తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ మ్యాజిక్ రిపీట్ కావడం పక్కా!
Advertisement

తాజా వార్తలు