వింటేజ్ లుక్స్ తో పవన్.. 'ఓజి'లో అదరగొట్టడం ఖాయం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan )లైనప్ లో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.

వాటిల్లో ఓజి( OG movie ) కూడా ఒకటి.

ఈ సినిమా షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.అలా ప్రకటించిన కొద్దీ రోజులకే షూట్ స్టార్ట్ చేసి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చాడు.

ముంబైలో స్టార్ట్ అయిన ఈ షూట్ ఆ తర్వాత పూణేలో కొద్దీ రోజులు జరుపుకుంది.ఇక ఇటీవలే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసినట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Sujith ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

Advertisement

ఇక హైదరాబాద్ లో జరుపు కుంటున్న ఈ సినిమా ఆన్ లొకేషన్ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.

వీటిల్లో పవన్ స్టైలిష్ గా మాత్రమే కాదు వింటేజ్ డ్రెస్సింగ్ స్టైల్ తో ఇంకా లుక్ తో ఆకట్టు కుంటున్నాడు.ఈ లుక్స్ కు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ను వింటేజ్ లుక్స్ లో చూడబోతున్నాం అని ఎగ్జైట్ అవుతున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్( Priyanka mohan ) హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

వీటితో పాటు పవన్ కళ్యాణ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు వినోదయ సీతం రీమేక్ బ్రో సినిమాలు కూడా ఉన్నాయి.ఈ సినిమాలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.వీటిలో రీమేక్ మూవీ బ్రో జులైలో రిలీజ్ కాబోతుంది.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు